
ముంబై: ఐపీఎల్‌లో విజయవంతమైన జట్టుగా పేరుపొందిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) గతేడాది మాత్రం ఆకట్టుకునే ప్రదర్శన నమోదు చేయలేదు. మూడుసార్లు చాంపియన్.. ఎనిమిది సార్లు ఫైనలిస్ట్ అయిన సీఎస్‌కే గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు పోందిన సురేశ్ రైనా గైర్హాజరీ కావడం.. జట్టును దెబ్బతీసింది. ఇటీవలే సురేశ్ రైనా తిరిగి జట్టుతో చేరడంతో చెన్నై మరోసారి బలంగా కనిపిస్తుంది.
తాజాగా ఎంఎస్ ధోని, రైనాలు కలిసి ప్రాక్టీస్ చేస్తున్న వీడియోనూ సీఎస్‌కే తన ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీజన్‌కు సంబంధించి సీఎస్‌కే మొయిన్ అలీ, కృష్ణప్ప గౌతమ్ లాంటి ఆటగాళ్లు జట్టుతో చేరారు. అయితే ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హజిల్‌వుడ్ మాత్రం ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కాగా వరుసగా బయో బబుల్స్‌లో గడుపుతుండడంతో వీటికి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హజిల్‌వుడ్ పేర్కొన్నాడు. కాగా ఈ నెల 10న ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే తన తొలి మ్యాచ్ ఆడనుంది.
చదవండి:
IPL 2021: సీఎస్‌కేకు ఎదురుదెబ్బ
IPL 2021: మెస్సీని వచ్చే ఏడాది తీసుకుంటాం
07:03 Anbu Moments! #Yellove #WhistlePodu 💛🦁 @msdhoni @ImRaina pic.twitter.com/eJ1pdDuLMt
— Chennai Super Kings (@ChennaiIPL) April 1, 2021