Breadcrumb
రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్.. ఉత్కంఠ పోరులో గుజరాత్‌దే విజయం
Published Wed, Apr 27 2022 7:08 PM | Last Updated on Wed, Apr 27 2022 11:31 PM
Live Updates
IPL 2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ లైవ్ అప్డేట్స్
రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్.. ఉత్కంఠ పోరులో గుజరాత్‌దే విజయం
సన్‌రైజర్స్ నిర్ధేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత సాహా (38 బంతుల్లో 68; 11 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 31 నాటౌట్; 4 సిక్సర్లు), తెవాతియా (21 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 22 పరుగులు కావల్సిన తరుణంలో రషీద్ ఖాన్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. సన్‌రైజర్స్ యువ పేస్ గన్ ఉమ్రాన్ మాలిక్ (5/25) సంచలన బౌలింగ్ ప్రదర్శన వృధా అయ్యింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌నైజర్స్ అభిషేక్ శర్మ (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్క్రమ్ (40 బంతుల్లో 56; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఫెర్గూసన్ వేసిన ఆఖరి ఓవర్లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు 4 సిక్సర్లు బాదారు. గుజరాత్ బౌలర్లలో షమీ 3, జోసఫ్, యశ్ దయాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
నిప్పులు చెరిగిన ఉమ్రాన్.. 140 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన గుజరాత్
సన్‌రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. ఇప్పటికే మూడు వికెట్లు పడగొట్టి గుజరాత్ వెన్నువిరిచిన ఈ కశ్మీరీ పేసర్.. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో మరో రెండు వికెట్లు పడగొట్టి మొత్తంగా ఐదు వికెట్లు తన ఖాతాలోనే వేసుకున్నాడు. వీటిలో నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్ రూపంలో దక్కడం విశేషం. 16వ ఓవర్లో ఉమ్రాన్ తొలుత మిల్లర్ (17), ఆతర్వాత అభినవ్ మనోహర్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 16 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 140/5.
మూడేసిన ఉమ్రాన్.. సాహా వికెట్ కూడా
ఎస్ఆర్హెచ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే రెండు వికెట్లు పడగొట్టిన మాలిక్ తాజాగా మరో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ధాటిగా ఆడుతూ సన్‌రైజర్స్‌ను బెదరగొడుతున్న సాహా (38 బంతుల్లో 68; 11 ఫోర్లు, సిక్స్)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 127/3. క్రీజ్‌లో మిల్లర్ (13), తెవాతియా (5) ఉన్నారు.
సాహో సాహా
196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు సాహా అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఈ వెటరన్ వికెట్‌కీపర్ తన సహజ శైలకి విరుద్ధంగా ధాటిగా ఆడుతూ సన్‌రైజర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈ క్రమంలో సాహా 28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 10.1 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 92/1.
హార్ధిక్ పాండ్యా ఔట్.. మరో దెబ్బేసిన ఉమ్రాన్ మాలిక్
గుజరాత్‌ను ఉమ్రాన్ మాలిక్ మరో దెబ్బ కొట్టాడు. బౌండరీ బాది జోరుమీదున్న హార్ధిక్ పాండ్యా (10)ను మాలిక్ బోల్తా కొట్టించాడు. హార్ధిక్.. జన్సెన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 9.2 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 85/2. క్రీజ్‌లో సాహా (48), మిల్లర్ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. గిల్ క్లీన్ బౌల్డ్
భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన గుజరాత్‌ను ఉమ్రాన్ మాలిక్ దెబ్బకొట్టాడు. మాలిక్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (24 బంతుల్లో 22; ఫోర్, సిక్స్) క్లీన్ బౌల్డయ్యాడు. మరో ఎండ్‌లో సాహా (22 బంతుల్లో 42) చెలరేగి ఆడుతున్నాడు. 8 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 73/1.
ధాటిగా ఆడుతున్న సాహా.. ధీటుగా బదులిస్తున్న గుజరాత్
సన్‌రైజర్స్ నిర్ధేశించిన 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ సైతం ధీటుగా జవాబిస్తుంది. ఓపెనర్ సాహా (13 బంతుల్లో 25; 4 ఫోర్లు, సిక్స్) ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 4 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 40/0. మరో ఎండ్‌లో గిల్ (10) ఆచితూచి ఆడుతున్నాడు.
రాణించిన అభిషేక్, మార్క్రమ్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌నైజర్స్ అభిషేక్ శర్మ (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్క్రమ్ (40 బంతుల్లో 56; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఫెర్గూసన్ వేసిన ఆఖరి ఓవర్లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు 4 సిక్సర్లు బాదారు. గుజరాత్ బౌలర్లలో షమీ 3, జోసఫ్, యశ్ దయాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అల్జరీ జోసఫ్ సూపర్ త్రో.. సుందర్ రనౌట్
అల్జరీ జోసఫ్ సూపర్ త్రో చేయడంతో వాషింగ్టన్ సుందర్ (3) రనౌటయ్యాడు. 162 పరుగుల వద్ద సన్‌రైజర్స్ ఆరో వికెట్ కోల్పోయింది. జన్సెన్ క్రీజ్‌లోకి వచ్చాడు.
సన్‌రైజర్స్ ఐదో వికెట్ డౌన్
స్కోర్ వేగం పెంచే క్రమంలో సన్‌రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. 18వ ఓవర్ ఆఖరి బంతికి యశ్ దయాల్ బౌలింగ్‌లో మార్క్రమ్ (40 బంతుల్లో 56; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 161/5. క్రీజ్‌లో సుందర్ (3), శశాంక్ సింగ్ ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
వరుసగా రెండో ఓవర్లో కూడా సన్‌రైజర్స్ వికెట్ కోల్పోయింది. కొత్తగా క్రీజ్‌లోకి వచ్చిన పూరన్ (3)ను షమీ బోల్తా కొట్టించాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన పూరన్ లాంగ్ ఆన్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 155/4. క్రీజ్‌లో మార్క్రమ్ (52), సుందర్ ఉన్నారు.
దెబ్బ కొట్టిన జోసఫ్
ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మను (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔట్ చేయడం ద్వారా అల్జరీ జోసఫ్ సన్‌రైజర్స్‌ను భారీ దెబ్బ కొట్టాడు. 16వ ఓవర్ తొలి బంతికి జోసఫ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 15.1 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 140/3. క్రీజ్‌లో మార్క్రమ్ (31 బంతుల్లో 41), పూరన్ ఉన్నారు.
గేర్ మార్చిన అభిషేక్ శర్మ.. వరుస సిక్సర్లతో ఫిఫి పూర్తి
10 ఓవర్ల వరకు ఆచితూచి ఆడిన అభిషేక్ శర్మ (51) 11వ ఓవర్లో గేర్ మార్చాడు. 7 బంతుల వ్యవధిలో 3 సిక్సర్లు బాది అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 112/2. క్రీజ్‌లో అభిషేక్‌తో పాటు మార్క్రమ్ (27) ఉన్నాడు.
ఆచితూచి ఆడుతున్న సన్‌రైజర్స్.. 10 ఓవర్ల తర్వాత 84/2
రాహుల్ త్రిపాఠి ఔటయ్యాక సన్‌రైజర్స్ స్కోర్‌లో వేగం తగ్గింది. అభిషేక్ శర్మ (36), మార్క్రమ్ (14) ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును నిదానంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఫలితంగా 10 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ స్కోర్ 84/2గా ఉంది.
రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
వరుసగా రెండు ఫోర్లు, సిక్సర్ బాది జోరుమీదున్న రాహుల్ త్రిపాఠిని (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) షమీ బోల్తా కొట్టించాడు. వేగంగా వికెట్లపైకి దూసుకొచ్చిన బంతిని ఆడబోయి త్రిపాఠి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినప్పటికీ షమీ రివ్యూకి వెళ్లి మరీ వికెట్ దక్కించుకున్నాడు. 5 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 44/2. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (12), మార్క్రమ్ ఉన్నారు.
షమీ స్టన్నర్.. విలియమ్సన్ క్లీన్ బౌల్డ్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు మహ్మద్ షమీ తొలి బ్రేక్ అందించాడు. మూడో ఓవర్ ఐదో బంతికి స్టన్నింగ్ డెలివరితో కేన్ విలియమ్సన్‌ను (8 బంతుల్లో 5; ఫోర్) క్లీన్ బౌల్డ్ చేశాడు. 3 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 26/1. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (10), రాహుల్ త్రిపాఠి ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) గుజరాత్ టైటాన్స్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడుతున్నాయి. ఈ ఆసక్తికర పోరులో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, ఎస్ఆర్హెచ్ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి మూడో స్థానంలో నిలిచింది.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యశ్ దయాల్, అల్జరీ జోసెఫ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జన్సెన్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
Related News By Category
Related News By Tags
-
సన్‌రైజర్స్‌కు షాకిచ్చిన రషీద్ ఖాన్, తెవాటియా
ముంబై: రషీద్ ఖాన్ గత సీజన్ దాకా సన్‌రైజన్స్ తురుపుముక్క. ఎన్నో మ్యాచ్‌లను తన స్పిన్‌తో గెలిపించాడు. ఈసారి గుజరాత్ స్పిన్నరైన రషీద్ మాజీ జట్టుపై తన ఐపీఎల్ కెరీర్లోనే చెత్త బౌలింగ్ ప్రదర్శన నమ...
-
IPL 2022: వేలంలో వ్యూహం చూసి ఆశ్చర్యపోయా.. కానీ ఇప్పుడు..
IPL 2022 GT Vs SRH: ఐపీఎల్ మెగా వేలం-2022 సమయంలో విమర్శల పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలో తడబడినా తిరిగి పుంజుకుని వరుస విజయాలతో దూసుకుపోతోంది. అదే విధంగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా...
-
రషీద్ ఖాన్‌కు అంత సీన్ లేదు.. సన్‌రైజర్స్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు తరలిపోయిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందరూ అనుకుంటున్నట...
-
ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలింగ్ రికార్డును సమం చేసిన సన్‌రైజర్స్ బౌలర్
Bhuvaneshwar Kumar: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 11) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ చెత్త బౌలింగ్ రికార్డును నమోదు చేశాడు....
-
IPL 2022: కెప్టెన్‌వి అని అహంకారమా? నీకసలు అర్హతే లేదు!
IPL 2022 SRH Vs GT: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. హార్దిక్‌లో నాయకుడి లక్షణాలు లేవని, జట్టు సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని విమర్శిస్తున్...
Comments
Please login to add a commentAdd a comment