ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు ఫ్రాంఛైజీలను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఆయా జట్లకు దూరం కాగా, మరి కొందరు క్రికెటర్ల అందుబాటుపై సందిగ్థత నెలకొంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మోచేతి గాయంతో బాధపడుతున్న విలియమ్సన్ ఇంకా పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. గత ఏడాది భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం.. విలియమ్సన్ ఏ విధమైన క్రికెట్ ఆడలేదు. కాగా తాజాగా కేన్ మామ ఎస్‌ఆర్‌హెచ్ జట్టుతో చేరాడు. కానీ ఫిట్‌నెస్ దృష్ట్యా.. తొలి మ్యాచ్‌కు విలియమ్సన్ బెంచ్‌కే పరిమితం కానున్నట్లు సమాచారం. కాగా గత ఏడాది సీజన్‌లో కూడా అఖరి లీగ్ మ్యాచ్‌కు గాయం కారణంగా విలియమ్సన్ దూరమయ్యాడు.
దీంతో అతడి స్ధానంలో మనీష్ పాండే సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. ఒకవేళ ఆరంభ మ్యాచ్‌కు విలియమ్సన్ దూరమైతే.. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు భువనేశ్వర్ కుమార్ లేదా అభిషేక్ శర్మ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 26 నుంచి వాంఖడే వేదికగా ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఎస్‌ఆర్‌హెచ్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న రాజస్తాన్ రాయల్స్‌తో ఢీకొట్టనుంది.
చదవండి: Sanju Samson: కండలు కరిగించాడు.. ఇక సిక్సర్ల వర్షమేనా!
Sudden ga summer cool ga anipistundi ante #SRH camp lo evaro adugupedutunnaru 🤪
— SunRisers Hyderabad (@SunRisers) March 16, 2022
Welcome, Kane Mama 🧡#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/biplUU6fZm
Comments
Please login to add a commentAdd a comment