LSG VS MI Predicted XI: ఐపీఎల్ 2022 సీజన్ కీలక దశకు చేరింది. అన్నీ జట్లు దాదాపు సగం మ్యాచ్‌లు ఆడేశాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ (7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలకు ఆక్రమించగా.. రాజస్థాన్ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), ఆర్సీబీ (8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), లక్నో (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), ఢిల్లీ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), కేకేఆర్ (8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), పంజాబ్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), సీఎస్‌కే (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), ముంబై (7 మ్యాచ్‌ల్లో ఓటములు) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి.
ఈ క్రమంలో ఇవాళ (ఏప్రిల్ 24) మరో కీలక మ్యాచ్ జరుగనుంది. సీజన్‌లో ఇప్పటివరకు గెలుపు వాసన ఎరుగని ముంబై ఇండియన్స్.. అడపాదడపా విజయాలు సాధిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇరు జట్లకు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలుపుకోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండగా, లక్నో పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది.
నేటి మ్యాచ్‌లో తుది జట్లు (అంచనా) ఎలా ఉండబోతున్నాయంటే.. వరుస పరాజయాల బాట పట్టిన ముంబై ఈ మ్యాచ్ కోసం ఒకటి, రెండు మార్పులు చేసే ఆస్కారం ఉంది. వరుసగా విఫలమవుతున్న పోలార్డ్, జయదేవ్ ఉనద్కత్‌లపై ముంబై యాజమాన్యం వేటు వేయవచ్చు. వారి స్థానాల్లో టిమ్ డేవిడ్, బాసిల్ థంపి తుది జట్టులోకి రావొచ్చు. వరుసగా విఫలమవుతున్నా రోహిత్, ఇషాన్ కిషన్‌లను పక్కకు పెట్టే సాహసం చేయకపోవచ్చు. అడపాదడపా మెరుపులు మెరిపిస్తున్న డెవాల్డ్ బ్రెవిస్‌కు మరో అవకాశం ఇవ్వవచ్చు. ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, బుమ్రాలను కొనసాగిస్తూ.. హృతిక్ షోకిన్, డేనియల్ సామ్స్, మెరిడిత్‌లకు మరో అవకాశం ఇవ్వవచ్చు.
ఇక లక్నో తుది జట్టు విషయానికొస్తే.. నేటి మ్యాచ్ కోసం ఆ జట్టు ఒకే ఒక మార్పు చేసే అవకాశం ఉంది. ఆశించిన మేర రాణించలేకపోతున్న మనీష్ పాండేకు బదులుగా కృష్ణప్ప గౌతమ్ తుది జట్టులోకి రావచ్చు. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ యధాతథంగా కొనసాగవచ్చు.
చదవండి: IPL 2022: ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలు ఖరారు..
Comments
Please login to add a commentAdd a comment