
IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలు లక్నో, అహ్మదాబాద్‌లకు బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. మెగా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అంశంపై తుది గడువును ప్రకటించింది. గతంలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు 2021, డిసెంబర్ 25ను గడువు తేదీగా నిర్ణయించినా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్‌పై బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఆటగాళ్ల ఎంపిక వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా జనవరి 31ని డెడ్‌లైన్‌గా ప్రకటిస్తూ బీసీసీఐ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ తంతు పూర్తి అయితే కానీ, వేలం నిర్వహించే వేదిక, తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించినట్లు సమాచారం. కాగా, ఇదివరకే బరిలో ఉన్న 8 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను మినహాయించి వేలంలో పాల్గొనే ఆటగాళ్లలో ముగ్గురు క్రికెటర్లను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కొత్త ఫ్రాంచైజీలకు కల్పించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ ఇప్పటికే తమ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, కోచ్‌గా ఆశిష్ నెహ్రా, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని లక్నో ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్, మెంటార్ గౌతమ్ గంభీర్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్ విషయంలో మాత్రం ఈ ఫ్రాంచైజీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
చదవండి: Ashes 4th Test: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ అద్భుత పోరాటం
Comments
Please login to add a commentAdd a comment