ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (మే 7) లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లు ప్రత్యేకమైన జెర్సీలలో కనపించనున్నారు. ఆదివారం (మే 8) మదర్స్ డే ను పురస్కరించుకుని లక్నో ఆటగాళ్లు.. ఇవాళ కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో వారి తల్లి పేరు గల జెర్సీలను ధరించనున్నారు. మదర్స్ డే సందర్భంగా తల్లులకు తాము ఇచ్చే నివాళి ఇది అని లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ట్విటర్‌లో వెల్లడించింది.
“This one’s for you, Maa.”
— Lucknow Super Giants (@LucknowIPL) May 7, 2022
Now THAT’s how you prepare for Mother’s Day - the #SuperGiant way! #AbApniBaariHai💪#IPL2022 🏆 #bhaukaalmachadenge #lsg #LucknowSuperGiants #T20 #TataIPL #Lucknow #UttarPradesh #LSG2022 pic.twitter.com/H4CNkJZ6LF
ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ తన తల్లి రాజేశ్వరి పేరుతో ఉండే జెర్సీని ధరించనుండగా.. అవేశ్ ఖాన్ (షబీనా ఖాన్), కృనాల్ పాండ్యా (నళిని), దీపక్ హుడా (జజ్బీర్ హుడా) రవి బిష్ణోయ్ (సోహ్ని దేవి), అయుష్ బదోని (విభా బదోని) లు తమతమ తల్లుల పేర్లతో ఉండే జెర్సీలను ధరించనున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో తమ ట్విటర్‌లో షేర్ చేసింది.
ఇదిలా ఉంటే, ఆదివారం (మే 8) మధ్యాహ్నం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ కలర్ జెర్సీల్లో కనిపించనున్నారు. గతేడాది కరోనా వారియర్స్‌కు మద్దతుగా బ్లూ కలర్ జెర్సీ ధరించిన ఆర్సీబియన్లు.. ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, చెట్ల పెంపకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘గో గ్రీన్’ నినాదంతో గ్రీన్ కలర్ జెర్సీలను ధరించనున్నారు.
చదవండి: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. అచ్చిరాని జెర్సీతో బరిలో దిగనున్న ఆర్సీబీ
Comments
Please login to add a commentAdd a comment