సీఎస్‌కే కెప్టెన్సీకి గుడ్ బై(PC: IPL)
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ధోని స్థానంలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సీఎస్‌కే కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇందుకు సంబంధించి సీఎస్‌కే ఫ్రాంఛైజీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ఆటగాడిగా మాత్రం ధోని కొనసాగనున్నాడు.
కాగా టీమిండియా మాజీ సారథి, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని సారథ్యంలో ఈ చెన్నై అద్భుత విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. 2010, 2011, 2018, 2021 సీజన్లలో నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచీ ధోనినే సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నాడు. అతడి గైర్హాజరీలో సురేశ్ రైనా సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పుడు రవీంద్ర జడేజా పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఇక సీఎస్‌కేతో ధోనికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోనిని, సీఎస్‌కేను విడదీసి చూడలేరు అభిమానులు. అలాంటిది సీజన్ ఆరంభానికి ముందు మిస్టర్ కూల్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అభిమానులు షాకయ్యారు. మార్చి 26న రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆరంభ మ్యాచ్‌కు ముందు తలా అనూహ్య నిర్ణయంతో విస్మయపోతున్నారు. ఇదిలా ఉండగా.. కెప్టెన్‌గా తన వారసత్వాన్ని కొనసాగించగల సత్తా జడేజాకే ఉందని భావించిన ధోని... జడ్డూ తన జట్టును తయారుచేసుకునే విధంగా ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రిటెన్షన్‌లో భాగంగా జడేజాను మొదటి పిక్‌గా ఎంపిక చేయడంలోనూ ధోని వ్యూహం ఉందన్న విషయం తెలిసిందే.
📑 Official Statement 📑#WhistlePodu #Yellove 💛🦁 @msdhoni @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022
Baasha Boys are back! 😎
Watch the full 📹 of Day 1 Super practice at Mumbai ➡️ https://t.co/huPIgIx0LE#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/UmsQWEsfo8
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022
Super Thanks Surat! Special 💛 from @imjadeja to the fans of Diamond City!#Yellove #WhistlePodu 🦁 pic.twitter.com/F17Byhw7Zz
— Chennai Super Kings (@ChennaiIPL) March 23, 2022
Comments
Please login to add a commentAdd a comment