IPl 2022: Sunrisers Hyderabad Cricketer Abhishek Sharma Dance Kalavathi Song Video - Sakshi
Sakshi News home page

IPL 2022: కళావతి సాంగ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడి స్టెప్పులు.. మా పాట.. మీ ఆట.. రెండూ అదిరిపోతాయి.. వైరల్‌

Published Sat, Mar 19 2022 2:18 PM | Last Updated on Wed, Mar 23 2022 6:31 PM

IPl 2022: Sunrisers Cricketer Abhishek Sharma Dance Kalavathi Song - Sakshi

ఐపీఎల్‌- 2022 సీజన్‌ ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఫ్రాంఛైజీలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు మరింత దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాయి. ఆటగాళ్ల మ్యాచ్‌ ప్రాక్టీసు​ వీడియోలతో పాటు.. ఖాళీ సమయాల్లో వారు సరదగా గడిపిన క్షణాలను బంధించి షేర్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు సన్‌రైజెర్స్‌ హైదరాబాద్‌ యువ ఆటగాడు ఆభిషేక్‌ శర్మ స్టెప్పులేశాడు.

దీనికి సంబంధించిన వీడియోను సన్‌రైజెర్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఆభిషేక్‌ డ్యాన్స్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్‌లు చేస్తున్నారు. ఓ యాజర్‌ స్పందిస్తూ.. 'మైఖేల్‌ జాక్సన్‌ లా డ్యాన్స్‌ చేస్తున్నా అనుకుంటున్నావా.. నీకంత లేదులే.. అయినా పర్లేదనిపించావు' అంటూ కామెంట్‌ చేశాడు. ఇక ఐపీఎల్‌ మెగా వేలంలో ఆభిషేక్‌ శర్మను రూ. 6.50 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ కొనుగోలు చేసింది. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్‌-2022 ప్రారంభం​ కానుంది. అదే విధంగా సన్‌రైజెర్స్‌ హైదరాబాద్‌ తమ తొలి మ్యాచ్‌లో మార్చి న రాజస్తాన్‌ రాయల్స్‌ను ఢీకొట్టనుంది.

మా పాట.. మీ ఆట అదుర్స్‌
అభిషేక్‌ శర్మ డాన్స్‌ వీడియోపై సర్కారు వారి పాట టీమ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించింది. ‘‘మా పాట.. మీ ఆట.. రెండూ అదిరిపోతాయి. ఆల్‌ ది బెస్ట్‌’’ అంటూ సన్‌రైజర్స్‌కు విషెస్‌ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement