
Courtesy: IPL
Ravindra Jadeja Will Be CSK Captain When MS Dhoni Retires.. ఐపీఎల్ 2022 మెగా వేలం నేపథ్యంలో రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు మంగళవారం సమర్పించాయి. చెన్నై, ముంబై, పంజాబ్, రాజస్తాన్, హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు.. 8 ఫ్రాంఛైజీలు మొత్తంగా 27 మందిని అట్టిపెట్టుకున్నాయి. ఇక ఐపీఎల్-2021 విజేత చెన్నై సూపర్ కింగ్స్.. రవీంద్ర జడేజా(16 కోట్లు), ఎంఎస్ ధోని(12 కోట్లు), మొయిన్ అలీ(8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్(6 కోట్లు)ను రిటైన్ చేసుకుంది.
చదవండి: IPL 2022: KL Rahul- Rashid Khan: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌పై ఏడాది పాటు నిషేధం!?
ఇక సీఎస్‌కే జడేజాను ఫస్ట్ రిటైన్ కింద 16 కోట్లు పెట్టడం వెనుక ధోని మాస్టర్‌ప్లాన్ ఉందంటూ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఊతప్ప మాట్లాడాడు. ''జడేజా ఫస్ట్ రిటైన్ వెనుక ధోని హస్తం ఉంది. జడేజా విలువ ఏంటో ధోనికి బాగా తెలుసు. ఒకవేళ ధోని ఈ సీజన్ తర్వాత పక్కకు తప్పుకుంటే జడేజా సీఎస్‌కేను నడిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా ధోని మాస్టర్ ప్లాన్‌లో భాగమే. జడేజాపై ధోనికున్న నమ్మకమే ఈరోజు అతన్ని రిటైన్ చేసుకునేలా చేసింది''. అంటూ తెలిపాడు.
చదవండి: కోట్ల ఖర్చు.. మెగా వేలం.. ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మరి మిగిలిన జట్ల వద్ద ఎంతంటే!
Comments
Please login to add a commentAdd a comment