Photo Credit: BCCI Twitter
టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇషాన్ కిషన్ రెండో స్థానంలో నిలిచాడు. 2026 ఏడాదిలో ఇషాన్ కిషన్ 173.2 స్ట్రైక్‌రేట్‌తో 892 పరుగులు సాధించాడు.
తొలి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ (2022లో 187.43 స్ట్రైక్‌రేట్‌తో 1164 పరుగులు) కొనసాగుతున్నాడు. ఇక 2025లో అభిషేక్ శర్మ 193.46 స్ట్రైక్‌రేట్‌తో 859 పరుగులు సాధించి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ముగ్గురి తర్వాత విరాట్ కోహ్లి (2022లో 781 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (2023లో 733 పరుగులు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. సంజూ శాంసన్ (57) అర్థసెంచరీతో రాణించగా, అభిషేక్ శర్మ (39), ఇషాన్ కిషన్ (34 నాటౌట్) రాణించారు. చివర్లో తిలక్ వర్మ (15 నాటౌట్) జట్టును గెలిపించాడు. రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీశ్‌కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్, బిష్ణోయిలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇరుజట్ల మధ్య చివరి టీ20 గురువారం ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.
Most runs for India in a calendar year in T20Is :
1164 - Suryakumar Yadav in 2022 (SR: 187.43)
892 - Ishan Kishan in 2026 (SR: 173.2)*
WHAT A COMEBACK FOR ISHAN KISHAN 🔥 pic.twitter.com/8Cds0c4w5a— Vipin Tiwari (@Vipintiwari952) September 15, 2026
ఇదీ చదవండి: యూపీఐ చార్జీలు.. ఏటా 84 వేల కోట్ల ఆదాయం!


