జైస్వాల్, లంక బౌల‌ర్ మధ్య వాగ్వాదం; కొట్టుకోవడమే తరువాయి! | Yashasvi Jaiswal Vs Asitha Fernando, Heated Clash After Wicket Sparks Drama In IND Vs SL 2nd Test, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

IND Vs SL: జైస్వాల్, లంక బౌల‌ర్ మధ్య వాగ్వాదం; కొట్టుకోవడమే తరువాయి!

Aug 23 2026 11:48 AM | Updated on Aug 23 2026 1:42 PM

Jaiswal Vs Asitha Fernando-Argument-Banter-Eachother-2nd-Test

Photo Credit: BCCI Twitter

కొలంబో వేదిక‌గా శ్రీలంక, భార‌త్ మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ ఔటైన త‌ర్వాత నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన జైస్వాల్ పెవిలియ‌న్ వెళుతున్న స‌మ‌యంలో లంక బౌల‌ర్ త‌న మాట‌ల‌తో రెచ్చ‌గొట్టాడు. దీంతో పెవిలియ‌న్ వైపు న‌డుచుకుంటూ వెళ్తున్న జైస్వాల్ ఒక్క‌సారిగా వెన‌క్కితిరిగి అసిత ఫెర్నాండోవైపు దూసుకొచ్చాడు. 

ఇద్ద‌రి మ‌ధ్య చిన్న‌పాటి వాగ్వాదం చోటుచేసుకోగా, కోపంతో జైస్వాల్.. ఫెర్నాండో క‌ళ్ల‌లోకి చూస్తూ త‌న హెల్మెట్‌తో అత‌డిని నెట్టివేసే ప్ర‌య‌త్నం చేశాడు. ప‌రిస్థితి సీరియ‌స్‌గా మారుతుంద‌ని గ్ర‌హించిన లంక కెప్టెన్ ధ‌నంజ‌య డిసిల్వా జైస్వాల్‌ను ప‌క్క‌కు తీసుకెళ్లి అక్క‌డి నుంచి పంపించేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

కాగా జైస్వాల్ ఔట‌వ్వ‌డానికి ముందు ఫెర్నాండో బౌలింగ్‌లోనే వ‌రుస‌గా మూడు ఫోర్లు బాదాడు. అయితే ఫెర్నాండో త‌న మ‌రుస‌టి బంతికే జైస్వాల్‌ను క్లీన్‌బౌల్డ్ చేయ‌డంతో లంక బౌల‌ర్ కోపంతో ప‌రిధి దాటి కామ్‌గా వెళుతున్న జైస్వాల్‌ను గెలికి మ‌రి క‌య్యం పెట్టుకున్నాడు. ఇక మ్యాచ్‌లో జైస్వాల్ వ‌న్డే త‌ర‌హా ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించాడు. 53 బంతుల్లో 45 ప‌రుగులు చేసిన జైస్వాల్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉండ‌డం విశేషం. 

 

Read: 95 రన్స్‌కే బంగ్లా ఆలౌట్‌.. రెండో టెస్టులో ఆసీస్ ఘ‌న విజ‌యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement