95 రన్స్‌కే బంగ్లా ఆలౌట్‌.. రెండో టెస్టులో ఆసీస్ ఘ‌న విజ‌యం | Mitchell Starc Shines Again As Australia Crush Bangladesh By An Innings And 51 Runs In Second Test, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

95 రన్స్‌కే బంగ్లా ఆలౌట్‌.. రెండో టెస్టులో ఆసీస్ ఘ‌న విజ‌యం

Aug 23 2026 10:58 AM | Updated on Aug 23 2026 12:01 PM

Starc Rise Again-Australia-Won-Innings-51 Runs Vs Bangladesh-2nd Test

Photo Credit: Twitter

బంగ్లాదేశ్‌తో మొద‌లైన రెండో టెస్టును ఆస్ట్రేలియా రోజున్న‌ర వ్య‌వ‌ధిలోనే ముగించింది. మాకే వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 51 ప‌రుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల‌తో చెల‌రేగిన మిచెల్ స్టార్క్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అద‌ర‌గొట్టాడు. 

4 వికెట్లు తీసిన స్టార్క్ ఓవ‌రాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి 10 వికెట్ల హాల్ న‌మోదు చేసి బంగ్లాదేశ్ న‌డ్డి విరిచాడు. 146 ప‌రుగుల వెనుకంజ‌తో త‌మ రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన బంగ్లాదేశ్ 95 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కెప్టెన్ న‌జ్ముల్ హ‌స‌న్ (31) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా, ముష్ఫిక‌ర్ ర‌హీమ్ (29 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. 

ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో స్టార్క్ 4, క‌మిన్స్‌, నాథ‌న్ లియోన్ చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్టారు. ఈ విజ‌యంతో ఆస్ట్రేలియా  రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ గెల‌వ‌గా, రెండో టెస్టులో మాత్రం ఆసీస్ నంబ‌ర్‌వ‌న్ ఆట‌ను ప్ర‌ద‌ర్శించి తొలి టెస్టు ఓట‌మికి బ‌దులు తీర్చుకోవ‌డంతో పాటు డ‌బ్ల్యూటీసీ ప‌ట్టిక‌లో త‌మ తొలి స్థానాన్ని మ‌రింత ప‌టిష్టం చేసుకుంది.

అంత‌క‌ముందు ఆస్ట్రేలియా త‌మ‌ తొలి ఇన్నింగ్స్‌లో 210 ప‌రుగుల‌కు ఆలౌటైంది. బంగ్లా బౌల‌ర్ షోరిఫుల్ ఇస్లామ్ ఏడు వికెట్ల‌తో చెల‌రేగ‌గా, కామెరాన్ గ్రీన్ అర్ధ‌సెంచ‌రీతో రాణించాడు. ఇక బంగ్లాదేశ్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 64 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. మిచెల్ స్టార్క్ ఆరు వికెట్ల‌తో బంగ్లా ప‌త‌నాన్ని శాసించాడు. ఇక రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి 10 వికెట్లు తీసిన స్టార్క్‌కే ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ కూడా ల‌బించింది.

సంక్షిప్త స్కోర్లు:
బంగ్లాదేశ్‌: 64&95 ఆలౌట్‌
ఆస్ట్రేలియా: 210 ఆలౌట్‌ 

Read: అరంగేట్రంతోనే అరుదైన రికార్డు.. ఎవరీ సారాంశ్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement