IND Vs WI: చరిత్ర సృష్టించిన విండీస్‌ ఓపెనర్‌ | John Campbell Fastest Century-Ever-Vs IND 2nd ODI-Breaks World Record | Sakshi
Sakshi News home page

IND Vs WI: చరిత్ర సృష్టించిన విండీస్‌ ఓపెనర్‌

Sep 30 2026 4:03 PM | Updated on Sep 30 2026 5:50 PM

John Campbell Fastest Century-Ever-Vs IND 2nd ODI-Breaks World Record

Photo Credit: Twitter

గౌహ‌తి వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో వెస్టిండీస్ ఓపెన‌ర్ జాన్ క్యాంప్‌బెల్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చరిత్ర సృష్టించాడు. 65 బంతుల్లోనే శ‌త‌కం మార్క్ అందుకున్న క్యాంప్‌బెల్ విండీస్‌ తరఫున భార‌త్‌పై వ‌న్డేల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ సాధించిన తొలి బ్యాట‌ర్‌గా నిలిచాడు. 

గ‌తంలో 1999లో సింగ‌పూర్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డేలో రికార్డో పావెల్ 72 బంతుల్లో శ‌త‌కం సాధించ‌గా, 2002లో విజ‌య‌వాడ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో మార్లోన్ శామ్యూల్స్ 73 బంతుల్లో, 2018లో గౌహ‌తి వేదిక‌గా షిమ్రోన్ హెట్‌మైర్ 74 బంతుల్లో సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నారు. 

అంతేకాదు వ‌న్డే క్రికెట్‌లో వెస్టిండీస్ త‌ర‌ఫున ఫాస్టెస్ట్ సెంచ‌రీ సాధించిన బ్యాట‌ర్ల జాబితాలోనూ క్యాంప్‌బెల్ చోటు ద‌క్కించుకున్నాడు. 65 బంతుల్లో సెంచ‌రీ బాదిన క్యాంప్‌బెల్ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో బ్రియాన్ లారా (45 బంతుల్లోనే) కొన‌సాగుతున్నాడు.

వన్డేల్లో విండీస్‌ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు (బంతుల వారీగా)
45 – బ్రియాన్ లారా వ‌ర్సెస్‌ బంగ్లాదేశ్, ఢాకా, 1999
55 – క్రిస్ గేల్ వర్సెస్ ఇంగ్లండ్, సెయింట్ జార్జెస్, 2019
61 – ఎవిన్ లూయిస్ వ‌ర్సెస్‌ శ్రీలంక, క్యాండీ, 2024
63 – నికోలస్ పూరన్ వ‌ర్సెస్‌ నెదర్లాండ్స్, హరారే, 2023
65 – జాన్ క్యాంప్‌బెల్ వ‌ర్సెస్‌ భారత్, గౌహతి, 2026
66 – షెయ్ హోప్ వ‌ర్సెస్‌ న్యూజిలాండ్, నేపియర్, 2025

అయితే సెంచ‌రీ బాదిన మ‌రుస‌టి ఓవ‌ర్లోనే బ్రార్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన క్యాంప్‌బెల్‌.. న‌మ‌న్‌ధిర్‌కు   క్యాచ్‌  ఇచ్చి వెనుదిరిగాడు. తొలి వ‌న్డేలో ఓట‌మి చ‌విచూసిన వెస్టిండీస్ రెండో వ‌న్డేను దూకుడుగా ఆరంభించింది. ముఖ్యంగా క్యాంప్‌బెల్ భార‌త బౌల‌ర్లపై విరుచుకుప‌డ్డాడు. అత‌డి ధాటికి వెస్టిండీస్ 25 ఓవ‌ర్ల‌లోనే 200 ప‌రుగుల మార్క్‌ చేరువకు వచ్చింది.  మ‌రో ఓపెన‌ర్ కీస్ కార్టీ 9 ప‌రుగుల‌కే వెనుదిరగ్గా, కెప్టెన్ షెయ్ హోప్ అర్థ‌సెంచ‌రీతో మెరిశాడు. ప్ర‌స్తుతం వెస్టిండీస్ 25 ఓవ‌ర్లలో రెండు వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగులు చేసింది.

ఇదీ చదవండి: భార‌త స్పిన్న‌ర్ ఆరు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌.. ఆసీస్ 176 ఆలౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement