Photo Credit: Twitter
ధర్మశాల వేదికగా ఇండియా వుమెన్-ఎ జట్టుతో జరుగుతున్న ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఎ జట్టు 176 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగుల భారీ ఆధిక్యం లభించినట్లయింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ రాచెల్ ట్రెనామన్ (44) టాప్ స్కోరర్‌గా నిలవగా, వికెట్ కీపర్ తాహిలా విల్సన్ (35) పరుగులతో పర్వాలేదనిపించింది.
భారత బౌలర్లలో స్పిన్నర్ వైష్ణవి శర్మ ఆరు వికెట్లతో చెలరేగగా, శుచి ఉపాధ్యాయ్, నికీ ప్రసాద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. తనీశా సింగ్ (92), నికీ ప్రసాద్ (91) సెంచరీలు మిస్ చేసుకోగా, ఓపెనర్ శుభా సతీష్ (59) అర్థసెంచరీ సాధించింది. లిల్లీ మిల్స్ నాలుగు వికెట్లు తీసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. శుభా సతీశ్ (11), ప్రియా పూనియా (2) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం భారత్ 202 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
𝐀 𝐦𝐚𝐬𝐬𝐢𝐯𝐞 𝟏𝟖𝟖-𝐫𝐮𝐧 𝐟𝐢𝐫𝐬𝐭-𝐢𝐧𝐧𝐢𝐧𝐠𝐬 𝐥𝐞𝐚𝐝 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 𝐀 👏
𝐈𝐧𝐝𝐢𝐚 𝐀: 𝟑𝟔𝟒/𝟏𝟎 (𝟏𝟎𝟑.𝟑)
Tanisha Singh - 92 (166)
Niki Prasad - 91 (112)
Lilly Mills - 4/98 (32.3)
𝐀𝐮𝐬𝐭𝐫𝐚𝐥𝐢𝐚 𝐀: 𝟏𝟕𝟔/𝟏𝟎 (𝟔𝟑.𝟒)
Rachel Trenaman - 44 (88)… pic.twitter.com/s0Jona9ayS— Female Cricket (@imfemalecricket) September 30, 2026
ఇదీ చదవండి: వెస్టిండీస్ ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ


