టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌తో రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. అయితే పంత్ లేని లోటు భారత జట్టులో స్పష్టంగా కన్పిస్తోంది.
అతడి స్ధానంలో జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్.. వికెట్ కీపింగ్ పరంగా పర్వాలేదనపిస్తున్నప్పటికీ బ్యాటింగ్‌లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన భరత్.. ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌లలో 18.42 సగటుతో కేవలం 129 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ క్రమంలో త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు భరత్‌ను పక్కన పెట్టి.. కిషన్‌కు గాని వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇవ్వాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కాకుండా మరో యువ వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ గురించి భారత సెలక్టర్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే వృద్ధిమాన్ సాహాకు టెస్టుల్లో అనుభవం ఉన్నప్పటికీ.. అతడి వయస్సు దృష్ట్యా సెలక్టర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరోవైపు కిషన్‌కు బ్యాటింగ్ పరంగా అద్భుతమైన స్కిల్స్ ఉన్నప్పటికీ.. వికెట్ కీపర్‌గా పెద్దగా అనుభవం లేదు. ఈ క్రమంలో మరో ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ గురించి సెలక్టర్లు వెతుకుతున్నారు.
ఎవరీ ఉపేంద్ర యాదవ్?
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రస్తుతం రైల్వేస్ తరపున దేశీవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. తొలి 9 ఏళ్ల పాటు ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఉపేంద్ర యాదవ్.. రెండేళ్ల కిందటే రైల్వేస్‌తో జత కట్టాడు. ఉపేంద్ర యాదవ్‌కు అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. అదే విధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్, లిస్ట్-ఏ క్రికెట్‌లో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.
ఇప్పటివరకు 37 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఉపేంద్ర.. 45.0 సగటుతో 1666 పరుగులు చేశాడు. ఇక వచ్చే నెలలో విండీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత జట్టును జూన్ 27న బీసీసీఐ ప్రకటించనుంది. జూలై 12న డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో భారత్ టూర్ ప్రారంభం కానుంది.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. శుబ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్! రుత్‌రాజ్ రీ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment