Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ స్టార్ విరాట్ కోహ్లి తన సూపర్‌ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి మరో అర్థసెంచరీతో మెరిశాడు. ఈ సీజన్‌లో కోహ్లికి ఇది ఆరో ఫిఫ్టీ కావడం విశేషం. ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్‌లో 50వ అర్థశతకం సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు.
వార్నర్ తర్వాత ఐపీఎల్‌లో 50 ఫిఫ్టీలు సాధించిన రెండో క్రికెటర్‌గా.. టీమిండియా తరపున తొలి క్రికెటర్‌గా కోహ్లి చరిత్రకెక్కాడు. వార్నర్ 172 మ్యాచ్‌ల్లో 59 అర్థశతకాలు సాధించి తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి 233 మ్యాచ్‌ల్లో 50 అర్థశతకాలు అందుకున్నాడు. వీరిద్దరి తర్వాత శిఖర్ ధావన్ 49 అర్థసెంచరీతో మూడో స్థానంలో, రోహిత్ శర్మ 41 అర్థసెంచరీలతో నాలుగో స్థానంలో, ఏబీ డివిలియర్స్ 40 అర్థసెంచరీలతో ఐదో స్థానంలో ఉన్నాడు.
దీంతో పాటు మరో రికార్డు కూడా కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీపై తొమ్మిదో అర్థసెంచరీ సాధించిన కోహ్లి.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు.
The 'boy from Delhi' is putting up a stellar show against the Capitals 😍#DCvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/trldI0zEN0
— JioCinema (@JioCinema) May 6, 2023
చదవండి:'ఎక్కడ తగ్గాలో తెలిసినోడు'.. చిన్ననాటి కోచ్ కాళ్లు మొక్కి
Comments
Please login to add a commentAdd a comment