న్యూఢిల్లీ : భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా గురువారం పింక్ బాల్ టెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మ్యాన్ స్టీవ్ స్మిత్‌లు స్నేహపూర్వక సంభాషణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 వరల్డ్ కప్ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటనను స్మిత్ గుర్తు చేశారు. లండన్‌లోని ఓవల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్టుల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. బౌండరీ వద్ద ఫీల్డింగ్‌లో ఉన్న స్మిత్‌ను కొందరు భారతీయులు తిట్టడం మొదలుపెట్టారు. దీంతో కోహ్లి స్పందించి తిట్టొద్దని వారిని కోరాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత అభిమానుల తరపున స్మిత్‌కు క్షమాపణలు కూడా చెప్పారు. ( ఒక్క మ్యాచ్.. రెండు రికార్డులు )
స్మిత్ ప్రశ్నకు కోహ్లి సమాధానం ఇస్తూ.. ‘‘ ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదని నేను నమ్ముతాను. తప్పులు చేస్తాం.. వాటి నుంచి నేర్చుకుంటాం. ఓ వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం మంచిది కాదని అప్పుడు నాకనిపించింది. అందుకే నిన్ను తిట్టొద్దని వారికి చెప్పాను. మనం ప్రత్యర్థులమైనప్పటికి.. ఓ మానవతాకోణం ఉంది. అందుకే ఈ రోజు ఇలా కలిసి మాట్లాడుకోగలుగుతున్నాం. ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment