బుమ్రాను ఒప్పించిన కోహ్లి.. ఆసీస్‌కు ఆరంభంలోనే షాకులు! | Kohli Single Handedly Convinces Bumrah for DRS India 1st Breakthrough vs Aus | Sakshi
Sakshi News home page

బుమ్రాను ఒప్పించిన కోహ్లి.. ఆసీస్‌కు ఆరంభంలోనే షాకులు!

Published Fri, Nov 22 2024 3:00 PM | Last Updated on Fri, Nov 22 2024 4:18 PM

Kohli Single Handedly Convinces Bumrah for DRS India 1st Breakthrough vs Aus

పెర్త్‌ టెస్టులో టీమిండియా కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తన పేస్‌ పదునుతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శిస్తూ.. వరుస విరామాల్లో వికెట్లు తీశాడు. బుమ్రా దెబ్బకు ఆసీస్‌ ఓపెనింగ్‌ ద్వయం చేతులెత్తేసింది.

అదే విధంగా.. అనుభవజ్ఞుడైన స్టీవ్‌ స్మిత్‌ను సైతం బుమ్రా అద్భుత రీతిలో డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు  టెస్టులు ఆడనుంది. ఇందులో భాగంగా పెర్త్‌ వేదికగా శుక్రవారం మ్యాచ్‌ మొదలైంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీలో బుమ్రా టీమిండియా తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.

రాణించిన పంత్‌, నితీశ్‌
ఇక టాస్‌ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్‌ అయింది. రిషభ్‌ పంత్‌(37), నితీశ్‌ రెడ్డి(41) రాణించడంతో ఈ మేర గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ క్రమంలో ఆసీస్‌ బ్యాటింగ్‌కు దిగగా.. బుమ్రా మూడో ఓవర్‌లోనే కంగారూలకు షాకిచ్చాడు.

బుమ్రా బౌలింగ్‌లో మూడో బంతికి ఆసీస్‌ ఓపెనర్‌, అరంగేట్ర ఆటగాడు నాథన్‌ మెక్‌స్వీనీ లెగ్‌ బిఫోర్‌ వికెట్‌(ఎల్బీడబ్ల్యూ)గా వెనుదిరిగాడు. అయితే, తొలుత ఫీల్డ్‌ అంపైర్‌ మెక్‌స్వీనీని నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ సమయంలో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌తో పాటు.. బుమ్రా కూడా రివ్యూకు వెళ్లే విషయంలో కాస్త సంశయించారు.

బుమ్రాను ఒప్పించిన కోహ్లి.. 
అయితే, విరాట్‌ కోహ్లి మాత్రం బుమ్రాను రివ్యూకు వెళ్లేలా ఒప్పించాడు. ఈ క్రమంలో రీప్లేలో మెక్‌స్వీనీ(10) అవుటైనట్లు తేలింది. దీంతో థర్డ్‌ అంపైర్‌ అతడిని అవుట్‌గా ప్రకటించగా.. బుమ్రా, టీమిండియా ఖాతాలో తొలిరోజు తొలి వికెట్‌ చేరింది.

తొలి మూడు వికెట్లు బుమ్రాకే
ఇక మళ్లీ ఏడో ఓవర్లో బుమ్రా వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగో బంతికి మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా(8)ను అవుట్‌ చేసిన బుమ్రా.. ఆ మరుసటి బాల్‌కే స్టీవ్‌ స్మిత్‌(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 19 పరుగులకే ఆసీస్‌ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

బుమ్రా ఆరంభంలోనే ఇలా మూడు వికెట్లు తీయగా.. అరంగేట్ర పేసర్‌ హర్షిత్‌ రాణా, మహ్మద్‌ సిరాజ్‌ సైతం విజృంభించారు. ఈ క్రమంలో 21 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 47 పరుగులు చేసింది.

చదవండి: నితీశ్‌ రెడ్డి ‘ధనాధన్‌’ ఇన్నింగ్స్‌.. టీమిండియా 150 ఆలౌట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement