‘సిగ్గుపడుతున్నా.. అతడిపై నిషేధం విధించండి’ | Lalit Modi Asks BCCI To Ban LSG Owner Sanjiv Goenka Over Rishabh Pant Treatment | Sakshi
Sakshi News home page

IPL 2026: ‘సిగ్గుపడుతున్నా.. అతడిపై నిషేధం విధించండి’

Apr 3 2026 11:09 AM | Updated on Apr 3 2026 11:30 AM

Lalit Modi Asks BCCI To Ban LSG Owner Sanjiv Goenka Over Rishabh Pant Treatment

Photo Courtesy: IPL 2026

ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ య‌జమాని సంజీవ్ గోయెంకాపై బీసీసీఐ నిషేధం విధించాలని ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. బుధ‌వారం ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో పరాజ‌యం అనంత‌రం సంజీవ్ గోయెంకా, రిష‌బ్ పంత్‌ల మ‌ధ్య వాడివేడి సంభాష‌ణ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. 

వీడియోలో ఇద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ వినిపించ‌న‌ప్ప‌టికీ, గోయెంకా ముఖ క‌వ‌ళిక‌లు, పంత్ స‌మాధానం చెబుతున్న తీరు గ‌మ‌నిస్తే ఎంతో తీవ్ర‌త‌తో కూడిన చ‌ర్చ‌గానే క‌నిపించింది. తాజాగా ల‌లిత్ మోదీ సంజీవ్ గోయెంకా ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ‘లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ఒక లూజర్‌, జోకర్‌. అతని ప్రవర్తన పట్ల నేను సిగ్గుపడుతున్నాను. మ్యాచ్‌లతో క్రికెట్ అభిమానులను అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)ను తీసుకొచ్చాము. 

అంతేకానీ క్రికెట్‌కు ఎటువంటి సంబంధం లేని ఒక ఫ్రాంచైజీ ఓనర్ ఆటగాళ్లపై అజమాయిషీ చెలాయించాలని చూడడం ఎంతమాత్రం సరైనది కాదు. ఒకవేళ ఇప్పటికీ నేను ఐపీఎల్ చైర్మన్‌గా ఉండుంటే సంజీవ్ గోయెంకాపై తక్షణమే నిషేధం విధించడంతో, జట్టులో అతని యాజమాన్య హక్కులను శాశ్వతంగా రద్దు చేసేవాడిని. 

సంజీవ్ గోయెంకా ఒక అవకాశవాది. నిజానికి ఐపీఎల్ నిబంధనల్లో ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకునేందుకు ఒక క్లాజ్‌ను ఏర్పాటు చేశాం. బీసీసీఐ ఆ క్లాజ్‌ను పరిశీలించి సంజీవ్ గోయెంకాపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది. నిజాయితీకి అధిక ప్రాధాన్యమిస్తే మంచిదని నా అభిప్రాయం.’ అని చెప్పుకొచ్చాడు.

కనిపించేదంతా నిజం కాదు..
అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంజీవ్ గోయెంకా, పంత్ సంభాషణకు సంబంధించిన వీడియోపై లక్నో యాజమాన్యం స్పందించింది. ‘మీ కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. పంత్‌, గోయెంకాల మధ్య సీరియస్ చర్చ జరుగుతున్న వీడియో క్లిప్పింగ్‌ను కట్ చేసి సోషల్ మీడియాలో షేర్‌చేశారు. 

కానీ అంతకముందు ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వీడియోను మీ ముందు ఉంచుతున్నాం. నిజం తెలుసుకోండి’ అంటూ పోస్ట్ చేసింది.లక్నో యాజమాన్యం పోస్ట్ చేసిన వీడియోలో పంత్‌, గోయెంకాలు మాట్లాడు కోవడానికి ముందు నవ్వుతూ ఒకనొకరు ఆలింగనం చేసుకున్నట్లుగా ఉంది. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ మ్యాచ్‌కు సంబంధించి సుదీర్ఘంగా చ‌ర్చించుకున్నారు. 

అప్పుడు రాహుల్‌.. ఇప్పుడు పంత్‌
కాగా 2024 సీజ‌న్‌లో అప్ప‌టి ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కూడా గోయెంకా ఇలాగే ప్ర‌వ‌ర్తించిన తీరు అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. బ‌హిరంగంగానే కెప్టెన్‌పై గోయెంకా అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. తాజ‌గా పంత్ విష‌యంలోనూ అలాగే వ్య‌వ‌హ‌రించాడ‌ని భావిస్తున్న త‌రుణంలో ల‌క్నో ఫ్రాంచైజీ కొత్త వీడియోను రిలీజ్ చేసి అనుమానాల‌కు తెర‌దించింది.

చదవండి: ‘నేనైతే ఫుల్‌ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్‌ భావోద్వేగం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement