Photo Credit: Sri Lanka Cricket Twitter
సొంతగడ్డపై శ్రీలంక మహిళల జట్టు గర్జించింది. డంబుల్లా వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక ఓపెనర్ ఇమేషా దులాని (64 బంతుల్లో 101 నాటౌట్) అజేయ సెంచరీ చేయడంతో పాకిస్తాన్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇమేషాకు తోడుగా కెప్టెన్ చమేరి ఆటపట్టు (22 బంతుల్లో 39) రాణించడంతో పాక్ విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బౌలర్లలో నష్రా సంధు 2 వికెట్లు తీసింది.
కాగా తన టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ సాధించి ఇమేషా దులాని లంక తరఫున టీ20 క్రికెట్‌లో సెంచరీ సాధించిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఇంతకముందు 2024లో మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో చమేరి ఆటపట్టు (119 నాటౌట్) లంక తరఫున శతక్కొట్టిన తొలి వుమెన్ బ్యాటర్‌గా నిలిచింది. సమరవిక్రమ (86 నాటౌట్, 2024లో ఐర్లాండ్‌పై) మూడో స్థానంలో ఉంది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్లు షావాల్ జుల్ఫికర్ (41 బంతుల్లో 63) అర్ధసెంచరీ చేయగా, మునీబా అలీ (24 బంతుల్లో 42) రాణించింది. ఎమన్ నసీర్ (21), అయేషా జఫర్ (17) పర్వాలేదనిపించారు.
లంక బౌలర్లలో కవిషా దిల్హరి 2 వికెట్లు తీయగా, కాయా కవింది, సుగందిక, చమోడి ప్రబోద తలా ఒక వికెట్ తీశారు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.
A sensational unbeaten century! 💯🔥
Imesha Dulani stands tall with a magnificent 101* runs, guiding Sri Lanka Women with a classy batting masterclass. 🇱🇰🏏#SriLankaCricket #SLvPAK pic.twitter.com/2aMMTCsbtx— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 31, 2026
చదవండి: CWG 2026: ఫైనల్లో ప్రీతి.. బాక్సింగ్‌లో పతకం ఖాయం


