భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు 18 సభ్యులతో కూడిన ప్రిలిమనరీ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టులో కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు.
అదే విధంగా భారత సంతతికి చెందిన యువ స్పిన్నర్ తన్వీర్ సంగాకు ఈ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. ఒక సాధరణ టాక్సీ డ్రెవర్ కుటంబంలో పుట్టి.. అంతర్జాతీయ స్ధాయిలో సత్తాచాటేందుకు సిద్దమైన సంగా కోసం పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఎవరీ తన్వీర్ సంగా?
తన్వీర్ సంగా.. భారత మూలాలు కలిగి ఉన్న వ్యక్తి. తన్వీర్ సంగా తండ్రి జోగా సంగా స్వస్థలం పంజాబ్‌లోని జలంధర్. 1997లో అతడు తన కుటంబంతో ఆస్ట్రేలియాకు వెళ్లి స్ధిరపడ్డాడు. సంగా తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తుంది. కాగా 21 ఏళ్ల తన్వీర్ సంగాకు చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి ఎక్కువ.
2020లో న్యూ సౌత్‌వేల్స్ తరపున ఫస్ట్‌క్లాస్ ఎంట్రీ ఇచ్చిన సంగా.. తన అరంగేట్ర సీజన్‌లోనే అందరిని అకట్టుకున్నాడు. అదే విధంగా 2020 అండర్-19 ప్రపంచకప్‌లో కూడా సంగా సత్తాచాటాడు. 6 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్లలో ఒకడిగా నిలిచాడు.
ఈ క్రమంలో 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఆసీస్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. కానీ అతడికి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. అయితే ఆసీస్ జట్టుకు ఎంపికైన నాలుగో భారత సంతతికి చెందిన ఆటగాడిగా సంగా రికార్డులకెక్కాడు. సంగా కంటే ముందు గురీందర్ సంధు, స్టువర్ట్ క్లార్క్, బ్రాన్స్‌బీ కూపర్‌లు ఈ జాబితాలో ఉన్నారు. మరోవైపు తన్వీర్ సోదురుడు జాసన్ సంగా కూడా క్రికెటరే కావడం విశేషం. అతడు కూడా దేశీవాళీ క్రికెట్‌లో న్యూ సౌత్‌వేల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా , ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్.
చదవండి: IND Vs WI 2nd T20I: నికోలస్ పూరన్‌కు బిగ్‌షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా! ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment