ఆర్చర్‌తో బుమ్రా (PC: MI)
Jasprit Bumrah and Jofra Archer: ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ ఒక్క చోట చేరారు. మహిళా ప్రీమియర్ లీగ్-2023 ఫైనల్ వీక్షించేందుకు తరలివచ్చిన వీరిద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బుమ్రా, ఆర్చర్ డెడ్లీ కాంబో చూసే అవకాశం మాత్రం ఈసారికి లేదని ఉసూరుమంటున్నారు.
కాగా వెన్నునొప్పి తిరగబెట్టిన కారణంగా బుమ్రా ఇప్పటికే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సహా ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కీలక బౌలర్ సేవలను కోల్పోనుంది.
అయితే, రైట్ ఆర్మ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రూపంలో వారికి సరైన ఆప్షన్ లభించింది. ఈ ఏడాది అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాల నడుమ ముంబైలో వాలిపోయి అభిమానులను ఖుషీ చేశాడీ ఇంగ్లండ్ బౌలర్. ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్‌లోనే ముంబై ఇండియన్స్ వుమెన్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
ఆర్చర్‌తో బుమ్రా ముచ్చట్లు
ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఆదివారం నాటి మ్యాచ్‌ను వీక్షించేందుకు ముంబై ఇండియన్స్ పురుషుల జట్టు బ్రబౌర్న్ స్టేడియానికి తరలివచ్చింది. హర్మన్ సేనను చీర్ చేస్తూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సహా పలువురు ముంబై క్రికెటర్లు సందడి చేశారు. ఈ క్రమంలో జోఫ్రాతో బుమ్రా ముచ్చటిస్తున్న దృశ్యాలను ఫ్రాంఛైజీ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
ఈ వీడియో ఇప్పటికే అర మిలియన్‌కు పైగా లైకులు సాధించింది. దీనిపై స్పందించిన ముంబై పల్టన్ ఫ్యాన్స్.. ‘‘బుమ్రాకు రీప్లేస్‌మెంట్‌గా జోఫ్రా.. కానీ మీ డెడ్లీ కాంబో చూసే అవకాశం లేకుండా పోయింది. బుమ్రా భాయ్ కూడా ఆడితే బాగుంటుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు.
కాగా ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్‌ను 8 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 2 నాటి మ్యాచ్‌తో ముంబై తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఆర్చర్(గతంలో రాజస్తాన్ రాయల్స్) ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ విన్నర్‌గా ముంబై ఇండియన్స్ అవతరించి చరిత్ర సృష్టించింది.
చదవండి: BCCI: భువనేశ్వర్‌కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే!
Shikhar Dhawan: 'మా నాన్న కొట్టాడు.. నేను హెచ్‌ఐవి టెస్ట్ చేయించుకున్నాను'
WPL 2023: అవార్డులు ఎవరికి? విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతంటే! పీఎస్‌ఎల్ చాంపియన్ కంటే చాలా ఎక్కువ!
Comments
Please login to add a commentAdd a comment