చిక్కుల్లో పడిన క్రికెటర్‌ షమీ సోదరుడు! | Mohammed Shami Brother-Mohammed Kaif In Trouble Woman Allegations | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో పడిన క్రికెటర్‌ షమీ సోదరుడు!

May 2 2026 6:52 PM | Updated on May 2 2026 7:32 PM

Mohammed Shami Brother-Mohammed Kaif In Trouble Woman Allegations

టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ సోదరుడు, క్రికెటర్‌ మహమ్మద్ కైఫ్‌ చిక్కుల్లో పడ్డాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఒక మహిళ షమీ సోదరుడిపై ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. విషయంలోకి వెళితే.. ఉమ్మడి స్నేహితుడు ఇమ్రాన్‌ ద్వారా మహమ్మద్ కైఫ్‌ను బాధితురాలు కలిసింది. వారి తొలి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. 

ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేయడం మొదలుపెట్టిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కొంతకాలం తర్వాత బాధితురాలు కైఫ్ వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అప్పటినుంచి కైఫ్ ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపించిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. 

ఇక మహ్మద్ షమీ సోదరుడైన మహమ్మద్ కైఫ్ దేశవాలీ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ సహా విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు పలు దేశీయ టోర్నమెంట్లలో ఆడాడు. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన కైఫ్ తన కెరీర్‌లో మొత్తం మహమ్మద్ కైఫ్ 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 43 వికెట్లు, 9 లిస్ట్ -ఏ మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. 

షమీ కుటుంబానికి వివాదాలు కొత్త కాదు. షమీ భార్య హసీన్ జహాన్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా ఈ భారత క్రికెటర్ తరచూ వార్తల్లో నిలిచాడు. గత జనవరిలో ఓటర్ల జాబితాలో అవకతవకల కారణంగా షమీతో పాటు కైఫ్‌ను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. 

ఇక నిలకడైన ఆటతీరుకు మారుపేరైన షమీ 2023 వన్మింన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయాడు. అయితే ఐపీఎల్ 19వ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున ఆడుతున్న షమీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడి 7 వికెట్లు తీశాడు.

చదవండి: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement