IPL 2023, CSK Vs LSG: MS Dhoni Lights Up Chepauk With Sixes, Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2023- MS DHONI: ధోనితో అట్లుంటది మరి.. 20వ ఓవర్‌ అంటే పూనకాలే! వీడియో వైరల్‌

Published Mon, Apr 3 2023 10:56 PM | Last Updated on Tue, Apr 4 2023 11:03 AM

MS Dhoni Lights Up Chepauk With Sixes - Sakshi

PC: IPL.com

చెన్నైసూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంస్‌ ధోని మరోసారి ఫినిషర్‌ అవతరమెత్తాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా చెపాక్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినన ధోని.. వరుసగా రెండు సిక్సర్లు బాది అభిమానలను అలరించాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో తొలి బంతికి జడేజా పెవిలియన్‌కు చేరాడు. అనంతరం ధోని క్రీజులోకి వచ్చాడు.

తన ఎదుర్కొన్న తొలి బంతినే తలైవా స్టాండ్స్‌కు తరలించాడు. తర్వాత రెండో బంతిని కూడా భారీ సిక్సర్‌గా మిస్టర్‌ కూల్‌ మలిచాడు. దీంతో ఒక్కసారిగా చెపాక్‌ స్టేడియం మొత్తం ధోని నినాదంతో దద్దరిల్లిపోయింది. అయితే ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. ఓవరాల్‌గా 3 బంతులు ఎదుర్కొన్న ధోని 400 స్ట్రైక్‌ రేట్‌తో 12 పరుగులు చేశాడు.

కాగా ధోని సిక్సర్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. సీఎస్‌కే బ్యాటర్లలో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(57), డెవాన్‌ కాన్వే(47), అంబటి రాయుడు(14) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు.
చదవండిIPL 2023- Ben Stokes: ఈ మాత్రం ఆటకి 16 కోట్లు దండగా! ఒక్క సిక్సర్‌ కూడా లేదు! సెట్‌ కాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement