MS Dhoni smashes a massive six during net session, video goes viral - Sakshi
Sakshi News home page

IPL 2023: భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్‌

Published Tue, Jan 31 2023 1:40 PM | Last Updated on Tue, Jan 31 2023 3:14 PM

MS Dhoni smashes sixes during in nets in a viral video - Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన ప్రాక్టీస్‌ను మరింత వేగవంతం చేశాడు. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ధోని మాత్రం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 

గతేడాది ఐపీఎల్‌లో లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టిన సీఎస్‌కేను..  ఈ సారి మాత్రం ఛాంపియన్‌గా నిలపాలని తలైవా భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే మిస్టర్‌ కూల్‌ జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్ స్టేడియంలో నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

తాజాగా ధోని ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్పిన్‌ బౌలింగ్‌కు ప్రాక్టీస్‌ చేస్తున్న ధోని.. భారీ సిక్స్‌లు కొట్టడం ఆ వీడియోలో కన్పించింది. దీంతో తలైవా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

కాగా రాంఛీ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా టీమిండియా ఆటగాళ్లను ధోని కలిసిన సంగతి తెలిసిందే. ఇక గత సీజన్‌లో సీఎస్‌కే 14 మ్యాచ్‌లాడి నాలుగింటిలో మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే  ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ కానుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి.  కాగా ధోని సారథ్యంలో సీఎస్‌కే ఇప్పటివరకు నాలుగుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచింది.
చదవండిSA20 2023: ముంబై జట్టుకు స్టార్‌ ఆటగాడు దూరం.. విధ్వంసకర ఆల్‌రౌండర్‌ ఎం‍ట్రీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement