చెల‌రేగిన సీఎస్కే బౌలర్‌.. రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ క‌ప్‌ | Mukesh Kumar 6 Wkts-ROI-Won Irani Cup 2026-Beat-Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

చెల‌రేగిన సీఎస్కే బౌలర్‌.. రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ క‌ప్‌

Oct 4 2026 2:44 PM | Updated on Oct 4 2026 3:48 PM

Mukesh Kumar 6 Wkts-ROI-Won Irani Cup 2026-Beat-Jammu And Kashmir

Photo Credit: Twitter

ఇరాన్ క‌ప్ విజేత‌గా రెస్టాఫ్ ఇండియా నిలిచింది. రంజీ చాంపియ‌న్ జ‌మ్మూ క‌శ్మీర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా 167 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో హ‌ఫ్ సెంచ‌రీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేసిన స్మ‌ర‌ణ్ ర‌విచంద్ర‌న్‌కు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ద‌క్కింది. 

278 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జమ్మూ క‌శ్మీర్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఓపెన‌ర్లు ఖుమ్రాన్ ఇక్బాల్ (32), శుభ‌మ్ క‌జురియా (36) మినహా మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌య్యారు. రెస్టాఫ్ బౌల‌ర్లలో ముకేశ్ కుమార్ ఆరు వికెట్ల‌తో చెల‌రేగ‌గా, ఆకాశ్ దీప్ 3 వికెట్లు, ముకేశ్ చౌద‌రీ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. 

అంత‌క‌ముందు రెస్టాఫ్ ఇండియా త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 237 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, జ‌మ్మూ క‌శ్మీర్ 278 ప‌రుగుల‌కు ఆలౌటైంది. త‌ద్వారా జమ్మూ క‌శ్మీర్ 41 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం సాధించింది. అయితే త‌మ రెండో ఇన్నింగ్స్‌లో రెస్టాఫ్ ఇండియా 319 ప‌రుగుల‌కు ఆలౌటైంది. స్మ‌ర‌ణ్ ర‌విచంద్ర‌న్ (135) సెంచ‌రీ చేయ‌గా, స‌త‌న్ సంగ్వాన్ (55) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. 

క‌శ్మీర్ బౌల‌ర్ల‌లో ఉమ‌ర్ న‌జీర్‌, సునీల్ కుమార్ చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్టారు. దీంతో రెస్టాఫ్ ఇండియా 278 ప‌రుగుల టార్గెట్‌ను జమ్మూ క‌శ్మీర్ ముందు ఉంచ‌గా, ఆ జ‌ట్టు పూర్తిగా విఫ‌ల‌మై 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూల‌డంతో రెస్టాఫ్ ఇండియా విజేత‌గా నిలిచింది.

 

ఇదీ చదవండి: శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు.. గంగూలీ సరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement