నెదర్లాండ్స్ స్టార్ క్రికెటర్ బెన్ కూపర్ శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించాడు. నెదర్లాండ్స్‌కు దాదాపు పదేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన బెన్ కూపర్.. ఆ జట్టులో స్టార్ ఆటగాడిగా వెలుగొందాడు. 2013 ఆగస్టులో కెనడాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా బెన్ కూపర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.ఆ తర్వాత మూడు నెలలకు అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ ద్వారా టి20ల్లో అరంగేట్రం చేశాడు. 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కూపర్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
చదవండి: ICC Cricket World Cup: 11 మంది ప్లేయర్లు లేక టోర్నీ మధ్యలోనే నిష్క్రమణ
''కొన్నిరోజుల్లో నేను 30లోకి అడుగుపెట్టబోతున్నా. పదేళ్ల పాటు డచ్ క్రికెట్‌కు నా సేవలందించా. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు మాకు పెద్దగా అవకాశాలు రావు. ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీల్లో మాత్రమే ఎక్కువ మ్యాచ్‌లు ఆడే వీలుంటుంది. వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్ జరగనుంది. కానీ నేను తప్పుకుంటేనే కొత్త ఆటగాళ్లకు చాన్స్ వస్తుంది. విధి లేకనే ఆటకు గుడ్‌బై చెబుతున్నా. దానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా.'' అంటూ పేర్కొన్నాడు.
గతేడాది జూన్‌లో శ్రీలంకతో చివరి వన్డే ఆడిన బెన్ కూపర్.. మళ్లీ అదే శ్రీలంకతో ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచ్ అతనికి ఆఖరి టి20 . ఇక నెదర్లాండ్స్ తరపున టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన బెన్ కూపర్ మొత్తంగా 58 టి20 మ్యాచ్‌ల్లో 1239 పరుగులు సాధించాడు. ఇక 13 వన్డేల్లో 187 పరుగులు చేశాడు. ఇక దేశవాలీ క్రికెట్ విషయానికి వస్తే.. 29 ఏళ్ల బెన్ కూపర్ నాలుగు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 451 పరుగులు.. 55 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 994 పరుగులు సాధించాడు.
చదవండి: Rafael Nadal: రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే
Comments
Please login to add a commentAdd a comment