ముంబై వీడినా పాండ్యాకు బంపరాఫర్‌! | New Captaincy Chance-A Blockbuster Trade Move For Hardik Pandya | Sakshi
Sakshi News home page

ముంబై వీడినా పాండ్యాకు బంపరాఫర్‌!

May 29 2026 6:36 PM | Updated on May 29 2026 7:22 PM

New Captaincy Chance-A Blockbuster Trade Move For Hardik Pandya

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. జ‌ట్టును న‌డిపించ‌డంలో హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. ఈ నేప‌థ్యంలో సీజ‌న్ మ‌ధ్య‌లోనే పాండ్యాను కెప్టెన్సీ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని ముంబై యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా పాండ్యా ముంబై ఇండియ‌న్స్‌కు గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

ఇందుకు అత‌డు త‌న సోష‌ల్ మీడియాలో అకౌంట్‌లో పెట్టిన పోస్టులే ఉదాహ‌ర‌ణ‌. దీనికి తోడు పాండ్యా కెప్టెన్సీ, అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వ్వ‌డంతో ముంబై యాజ‌మాన్యం కూడా పాండ్యాను జ‌ట్టు నుంచి రిలీజ్ చేయాల‌ని భావిస్తోంది. ముంబై ఇండియ‌న్స్ నుంచి బ‌య‌టికి రానున్న హార్దిక్ పాండ్యా వ‌చ్చే సీజ‌న్‌లో ఏ జ‌ట్టులోకి వెళ్తే బాగుంటుంద‌నే చ‌ర్చ జోరుగా  సాగుతుంది. 

సీఎస్‌కే లేదా ల‌క్నోకు పాండ్యా కెప్టెన్‌గా వెళ్లే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్ జ‌ట్టులోకి కూడా హార్దిక్ పాండ్యా వెళ్లే అవ‌కాశం లేక‌పోలేదు. 2022 ఐపీఎల్‌ సీజ‌న్‌లో తొలిసారి ఆడిన‌ గుజ‌రాత్ టైటాన్స్‌ను చాంపియ‌న్‌గా నిలిపాడు హార్దిక్‌ పాండ్యా. త‌ర్వాతి సీజన్లోనూ ఆ జ‌ట్టును ఫైన‌ల్ చేర్చాడు. 

అయితే గుజ‌రాత్‌ను చాంపియ‌న్‌గా నిల‌ప‌డంతో ముంబై ఇండియ‌న్స్ హార్దిక్ పాండ్యాను భారీ ధ‌ర‌కు జ‌ట్టులోకి తీసుకొచ్చింది. రోహిత్ నుంచి జ‌ట్టు ప‌గ్గాలు తీసుకున్న పాండ్యా ముంబైని విజ‌య‌వంతంగా న‌డిపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. గ‌తేడాది సీజ‌న్‌లో ముంబైని ప్లేఆఫ్స్ చేర్చిన పాండ్యా ఈ సీజ‌న్‌లో అటు కెప్టెన్‌గా, ఇటు ఆట‌గాడిగా పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. మైదానంలో ఆట‌గాళ్ల‌తో అగ్రెసివ్‌గా ఉండ‌డం, జ‌ట్టులో సీనియ‌ర్ల‌తో స‌క్ర‌మంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం పాండ్యాకు పూర్తి నెగెటివ్‌గా మారిపోయింది. 

ఈ క్ర‌మంలోనే తాను ముంబైని వీడుతున్న‌ట్లు ప‌రోక్షంగా సంకేతాలు ఇవ్వ‌డం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే సీజ‌న్‌లో ముంబై ఆఖ‌రి మ్యాచ్ ఆడిన త‌ర్వాత పాండ్యా డ్రెసింగ్ రూమ్‌కు వెళ్తూ ధ‌రించిన‌ జెర్సీని విప్పి అభిమానుల వైపు విసిరేశాడు. అంతేకాదు రాజ‌స్తాన్‌తో మ్యాచ్ అనంత‌రం చాలా అల‌సిపోయాన‌ని, మారేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప‌రోక్షంగా హింట్ ఇచ్చాడు. మ‌రి ముంబై ఇండియ‌న్స్‌ను వీడ‌నున్న పాండ్యా ఏ జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముందో ఇప్పుడు ఒక‌సారి ప‌రిశీలిద్దాం.

ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌:
ముంబై నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే హార్దిక్ పాండ్యా ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా వెళ్లే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆ జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్న పంత్ ఇప్ప‌టికే తాను కెప్టెన్సీ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. 27 కోట్లు వెచ్చించిన ల‌క్నో యాజ‌మాన్యం కూడా పంత్ ప్ర‌ద‌ర్శ‌న‌పై అసంతృప్తితోనే ఉంది. పంత్‌ను వ‌దిలేసుకుంటే ల‌క్నో ద‌గ్గ‌రు ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటుంది. ఈ మేర‌కు హార్దిక్ పాండ్యాను మంచి ధ‌ర‌కు త‌మ జ‌ట్టులోకి తీసుకోవ‌డ‌మే గాక కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశ‌ముంది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌..
ఐపీఎల్ ఆరంభం నుంచి కొన‌సాగుతున్న జ‌ట్ల‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఒక‌టి. ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌గా పేరు మార్చుకున్న‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు త‌లరాత మాత్రం మార‌డం లేదు. ప్ర‌స్తుత ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న అక్ష‌ర్ ప‌టేల్ అంతంత‌మాత్రంగా రాణించాడు. జ‌ట్టులో ప్ర‌ధాన ఆటగాడిగా ఉన్న కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీపై పెద్ద‌గా ఆస‌క్తి లేదు. దీంతో అక్ష‌ర్ ప‌టేల్ స్థానంలో హార్దిక్‌పాండ్యాను కెప్టెన్‌గా నియ‌మిస్తే ఆల్‌రౌండర్‌గానూ సేవ‌లందించే అవ‌కాశం ఉంటుంది. అయితే అక్ష‌ర్ ప‌టేల్‌ను ఢిల్లీ రిలీజ్ చేయ‌క‌పోవ‌చ్చు.

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌:
2024లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలో మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్ ఆ త‌ర్వాత ఉన్న‌ప‌ళంగా అయ్య‌ర్‌ను వ‌దిలేసుకుంది. దీంతో అజింక్య రహానేను కెప్టెన్‌గా నియ‌మించింది. అత‌డి కెప్టెన్సీలో కేకేఆర్ పెద్ద‌గా రాణించింది లేదు. ఈ సీజ‌న్‌లో తొలి అంచె పోటీల్లో ఆరు వ‌రుస పరాజ‌యాలు ర‌హానేపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేశాయి. కామెరున్ గ్రీన్ ట్రేడింగ్‌లోకి వెళ్తే మాత్రం ముంబై ఇండియ‌న్స్ పాండ్యాను కేకేఆర్‌కు బ‌ద‌లాయించే అవ‌కాశ‌ముంటుంది. అప్పుడు పాండ్యాకు కేకేఆర్ కెప్టెన్ బాధ్య‌త‌లు అప్పగించే అవ‌కాశం కూడా ఉంది.

చెన్నై సూప‌ర్‌కింగ్స్‌:
ఇక ల‌క్నో త‌ర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వెళ్లేది సీఎస్‌కే జ‌ట్టులోకేన‌ని చాలా మంది అభిప్రాయం వ్య‌క్తం చేశారు.ఈ సీజ‌న్‌లో కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. అయితే సీజ‌న్‌లో మ‌ధ్య‌లో వ‌రుస విజ‌యాల‌తో ఊపందుకున్న సీఎస్‌కే ఒక ద‌శ‌లో ప్లేఆఫ్ రేసులోనూ నిలిచింది. అయితే ఇప్ప‌టికే రాజ‌స్తాన్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంస‌న్‌ను కూడా రుతురాజ్ స్థానంలో కెప్టెన్‌ను చేసే అవ‌కాశం లేక‌పోలేదు. అయితే ప్ర‌శాంత్ వీర్ లేదా శివ‌మ్ దూబేల‌లో ఒక‌రిని సీఎస్‌కే విడుద‌ల చేస్తే మాత్రం ట్రేడింగ్‌లో సీఎస్‌కే పాండ్యాను ద‌క్కించుకునే అవ‌కాశ‌ముంది.

రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌:
రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు బ‌లంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ రియాన్ ప‌రాగ్ కెప్టెన్సీ అనుభ‌వ‌లేమి కొట్టొచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే యాజ‌మాన్య హ‌క్కులు చేతులు మార‌డంతో వ‌చ్చే సీజ‌న్‌లో రాజ‌స్తాన్ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌వేళ పాండ్యా రాజ‌స్తాన్‌లోకి వ‌స్తే మాత్రం రియాన్ ప‌రాగ్ స్థానంలో అత‌డికి నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశ‌ముంది.

చదవండి: ఆ జట్టుదే ఐపీఎల్ 2026 టైటిల్.. ఏఐ జోస్యం!

Advertisement
 
Advertisement
Advertisement