PC: IPL.Com
టీమిండియా ఆల్‌రౌడర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఐపీఎల్-2022లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన హార్థిక్ 295 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్‌గా కూడా జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక తమ చివరి మ్యాచ్‌లో కేకేఆర్‌పై హార్థిక్ పాండ్యా 67 పరుగులతో రాణించాడు. కాగా ఎప్పుడూ మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నట్లు హార్థిక్ తెలిపాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకితో జరిగిన సంభాషణలో పాండ్యా ఈ విషయాన్ని వెల్లడించాడు.
"మూడో స్థానంలో ఆడాలనేది నా కల. 2016లో నేను ముంబై తరఫున నెం.3 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడిని. వాళ్లు మూడో స్థానానికి నన్ను ప్రమోట్ చేశారు. అప్పుడు అంతగా రాణించలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోను. నేను ఆ స్థానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాను. సరైన సమయంలో బ్యాటింగ్‌కు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శుభమాన్ గిల్ ఔట్ అయ్యాక నా వంతు పాత్ర నేను పోషిస్తున్నాను. ఒక వేళ నేను బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు గిల్ క్రీజులో ఉంటే.. అప్పడు నేను భిన్నంగా ఆడుతాను. ఒక వేళ అతడు తొందరగా ఔటైతే.. గిల్ బాధ్యతను నేను తీసుకుంటాను" అని హార్థిక్ పాండ్యా పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: టీమిండియాలో చోటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హార్ధిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment