సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ సీనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో కొత్త చాంపియన్ అవతరించింది. చెన్నైలో శనివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షి ప్‌లో ఒడిశా జట్టు తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఒడిశా జట్టు 5–1 గోల్స్ తేడాతో మూడుసార్లు చాంపియన్ హరియాణా జట్టును బోల్తా కొట్టించి జాతీయ చాంపియన్‌గా నిలిచింది.
ఒడిశా తరఫున శిలానంద్ లాక్రా (48వ, 57వ, 60వ నిమిషాల్లో) మూడు గోల్స్ సాధించగా... రజత్ ఆకాశ్ టిర్కీ (11వ నిమిషంలో), ప్రతాప్ లాక్రా (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. హరియాణా జట్టుకు జోగిందర్ సింగ్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు.
96 ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ఒడిశా జట్టుకిదే తొలి టైటిల్ కావడం విశేషం. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు 2–1తో మణిపూర్ జట్టును ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment