PC: IPL
ఐపీఎల్-2022 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా అర్చర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మోచేయి గాయంతో బాధపడుతున్న ఆర్చర్ గతేడాది నుంచి చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్-2022 సీజన్‌కు అందుబాటులో ఉండనని ఆర్చర్ ముందే ప్రకటించాడు.
అయినప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్,రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడి మరి ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్చర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ ట్విటర్‌లో షేర్ చేసింది. దీంతో ఆర్చర్ ఈ సీజన్‌లో ఆడనున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు అన్నీ ఆవాస్తమని తెలుస్తోంది. అతడు మోచేయికి రెండు శస్త్రచికిత్సలు జరగడంతో మరింత కాలం విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం.
దీంతో అతడు ఐపీఎల్-2022కు దూరం కావడం ఖాయం అనిపిస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్-2023 సీజన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా తాజాగా ముంబై ఇండియన్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్చర్ పాల్గొన్నాడు. "ముంబై ఇండియన్స్‌తో నా ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎదరు చూస్తున్నాను. ముంబై ఒక గొప్ప ఫ్రాంచైజీ. అటువంటి ఫ్రాంచైజీలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను.
మహేల జయవర్ధనే నా మొదటి కోచ్‌లలో ఒకరు. మా జట్టు ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తుంది అని ఆశిస్తున్నాను. నేను బహుశా ఈ సీజన్‌కు దూరం కావొచ్చు. ముంబై జట్టు ఎప్పుడూ ఒక కుటంబంగా ఉంటుంది. అందుకే జట్టు ఐదు టైటిళ్లు సాధించింది. పొలార్డ్ పదేళ్ల పాటు ముంబై జట్టులోనే ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్" అని అర్చర్ పేర్కొన్నాడు.
చదవండి: శ్రీలంకపై దుమ్మురేపాడు..‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా అయ్యర్!
Comments
Please login to add a commentAdd a comment