టీ20 ప్రపంచకప్-2022 రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ జట్టు.. ఇప్పుడు స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ హోం సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. కాగా 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ వేదికగా ఇంగ్లండ్ జట్టు బాబర్ సేనతో టెస్టుల్లో తలపడనుంది.
ఇక ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారథ్యం వహించనున్నాడు. ఇక గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ ఆటగాడు సర్ఫరాజ్ అహ్మద్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.
సర్ఫరాజ్ చివరిసారిగా 2019లో పాకిస్తాన్ తరపున టెస్టుల్లో ఆడాడు. అదే విధంగా స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో స్పీడ్‌స్టర్ హారీస్ రౌఫ్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక డిసెంబర్1న రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్‌తో టెస్టులకు పాక్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అజర్ అలీ, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రవూఫ్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ అలీ, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, నౌమాన్ అలీ, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాన్ మసూద్, జాహిద్ మెహమూద్
🚨 Our 18-player squad for the three-Test series against England 🚨#PAKvENG pic.twitter.com/NOXoTMPYDx
— Pakistan Cricket (@TheRealPCB) November 21, 2022
చదవండి: Ind Vs Ban: టీమిండియా అంటే ఆ మాత్రం ఉండాలి! వాళ్లు రాణిస్తేనే..! కనీసం 300 స్కోరు చేసి
Comments
Please login to add a commentAdd a comment