దిగ్గ‌జాల విష‌యంలో త‌మిళ‌నాడు క్రికెట్ కీల‌క నిర్ణ‌యం | R-Ashwin-Alongside-2-Indian-legends-Honoured-Astand-Chepauk-Stadium | Sakshi
Sakshi News home page

దిగ్గ‌జాల విష‌యంలో త‌మిళ‌నాడు క్రికెట్ కీల‌క నిర్ణ‌యం

Sep 29 2026 3:05 PM | Updated on Sep 29 2026 3:21 PM

R-Ashwin-Alongside-2-Indian-legends-Honoured-Astand-Chepauk-Stadium

Photo Credit: Twitter

త‌మిళ‌నాడు క్రికెట్ అసోసియేష‌న్ (టీసీఎన్ఏ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలోని 'ఎ' స్టాండ్‌కు భార‌త దిగ్గజ క్రికెట‌ర్లు ఎస్ వెంక‌ట్రాఘ‌వ‌న్  క్రిష్ణ‌మాచారి శ్రీకాంత్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ల పేర్ల‌ను పెట్టి వారిని గౌర‌వించ‌నుంది. చెన్నైలో జ‌ర‌గ‌నున్న చారిత్రాత్మ‌క బీబీఎల్ (బిగ్‌బాష్ లీగ్‌) మ్యాచ్‌కు ముందు ఈ ముగ్గురికి ప్ర‌త్యేక స‌న్మాన‌ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీసీఎన్ఏ పేర్కొంది. 

ఇక ఆస్ట్రేలియాకు చెందిన‌ 2027 బిగ్‌బాష్ లీగ్ ప్రీమియ‌ర్ టీ20 లీగ్ ప్రారంభ‌ మ్యాచ్‌కు చెపాక్ స్టేడియం వేదిక కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబ‌ర్ 12న మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌, పెర్త్ స్కార్చ‌ర్స్ మ‌ధ్య మ్యాచ్ చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో జ‌రగ‌నుంది. కాగా పైన పేర్కొన్న ముగ్గురు దిగ్గ‌జాలు త‌మిళనాడు జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించ‌డంతో పాటు భార‌త జ‌ట్టుకు కూడా ఆడారు. 

మాజీ క్రికెటర్లు క్రిష్ శ్రీకాంత్‌, అశ్విన్‌ల కంటే సీనియ‌ర్ అయిన‌ ఎస్‌ వెంక‌ట‌రాఘ‌వ‌న్ 1963 నుంచి 1985 మ‌ధ్య టీమిండియాకు ప్రాతినిధ్యం వ‌హించారు. 22 ఏళ్ల కెరీర్‌లో వెంక‌ట్రాఘ‌వ‌న్ 57 టెస్టులాడి 156 వికెట్లు ప‌డగొట్టారు. అంతేకాదు, 1975, 1979లో జ‌రిగిన తొలి రెండు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌కు ఎస్‌.వెంక‌ట‌రాఘ‌వ‌న్ భార‌త కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఇక క్రిష్ణ‌మాచారి శ్రీకాంత్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 66 ఏళ్ల శ్రీకాంత్ 80వ ద‌శ‌కం ఆరంభంలో త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో భార‌త క్రికెట్‌లో స‌రికొత్త విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చాడు. 1983 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త జ‌ట్టులో స‌భ్యుడైన క్రిష్ణ‌మ‌చారి శ్రీకాంత్ 1981 నుంచి 1992 వ‌ర‌కు భార‌త్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆయ‌న టీమిండియా త‌ర‌ఫున 43 టెస్టులు, 146 వ‌న్డేలు ఆడాడు. 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను టీమిండియా గెలిచిన సంద‌ర్భంలో శ్రీకాంత్ బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

ఇక అశ్విన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈత‌రం బౌల‌ర్ల‌లో బెస్ట్ స్పిన్న‌ర్‌గా పేరు పొందిన అశ్విన్ ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియాకు చాలా మ్యాచ్‌ల్లో ఆప‌ద్బాంధ‌వుడి పాత్ర‌ను పోషించాడు. టెస్టు క్రికెట్‌లో 537 వికెట్లు తీసిన అశ్విన్ టెస్టుల్లో భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన జాబితాలో కుంబ్లే త‌ర్వాత రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

దేశంలోని ప్ర‌ఖ్యాత స్టేడియాల్లోని స్టాండ్ల‌కు భార‌త క్రికెట‌ర్ల పేర్లు పెట్ట‌డం జ‌రిగింది. ఇప్ప‌టికే సునీల్ గావ‌స్క‌ర్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌, ఎంఎస్ ధోని, రోహిత్ శ‌ర్మ‌, కోహ్లి స‌హా 17 మంది క్రికెట‌ర్ల పేర్ల మీద స్టాండ్ లేదా పెవిలియ‌న్ ఉంది. తాజాగా ఈ  జాబితాలోకి వెంక‌ట‌రాఘ‌వ‌న్‌, శ్రీకాంత్‌, అశ్విన్ కూడా చేరారు. 

ఇక చిదంబ‌రం స్టేడియంలో క్రికెట‌ర్ల పేరిట ఒక స్టాండ్‌కు నామ‌క‌ర‌ణం చేయ‌డం చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసారి. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు మాజీ సీఎం క‌రుణానిధి పేరు మీద మాత్ర‌మే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు పేరు పెట్ట‌డం జ‌రిగింది.

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్‌.. సరికొత్త రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement