అఫ్గానిస్తాన్‌కు షాక్‌.. గుడ్‌బై చెప్పనున్న ర‌షీద్ ఖాన్‌! | Rashid Khan Likely-Retire-From-Test-Cricket-Ahead-IND Vs AFG Test | Sakshi
Sakshi News home page

IND Vs AFG Test Series: అఫ్గానిస్తాన్‌కు షాక్‌.. గుడ్‌బై చెప్పనున్న ర‌షీద్ ఖాన్‌!

Jun 5 2026 6:01 PM | Updated on Jun 5 2026 6:29 PM

Rashid Khan Likely-Retire-From-Test-Cricket-Ahead-IND Vs AFG Test

టీమిండియా, అఫ్గానిస్తాన్ మ‌ధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ టెస్టు రిటైర్మెంట్‌పై త్వ‌ర‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు ర‌షీద్ ఖాన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 

టెస్టు క్రికెట్‌లో చాలాసేపు బౌలింగ్ చేయాల్సి రావ‌డంతో, దీర్ఘకాలిక వెన్నునొప్పి వల్ల ఎక్కువ బంతులు వేయ‌లేన‌ని ర‌షీద్ ఖాన్ గ‌తం లోనే స్ప‌ష్టం చేశాడు. అయితే తాజాగా ర‌షీద్ ఖాన్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌నున్నాడా అనే దానిపై ఆ జ‌ట్టు కోచ్ రిచ‌ర్డ్ ఫైబ‌స్ స్పం దించారు. 'ర‌షీద్ ఖాన్ దీర్ఘ‌కాలిక న‌డుమునొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. టెస్టు క్రికెట్‌కు దూరమ‌వ్వాల‌ని ర‌షీద్ ఎప్పుడో నిర్ణ‌యిం చుకున్నాడు.

అత‌డు దేశంతో పాటు చాలా ప్రైవేటు లీగ్స్‌లో ఆడుతుంటాడు. అయితే ర‌షీద్ మా జ‌ట్టుకు ఫ్రంట్‌లైన్ బౌల‌ర్ కావ‌డంతో అత‌డిని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాల‌ని భావిస్తున్న ర‌షీద్‌తో నేను రెడ్‌బాల్ క్రికెట్‌లో కొన‌సాగాల‌ని అడుగుతాను. కానీ ఆడ‌తాడా లేదా అన్న‌ది అత‌డి నిర్ణ‌యంపైనే ఆధార‌ప‌డి ఉంది.

27 ఏళ్ల ర‌షీద్ ఖాన్ 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు నుంచే వెన్నుగాయం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వ‌స్తోంది. అప్ప‌టినుంచి ఎక్కువ‌సేపు బౌలింగ్ చేయ‌డంలో ర‌షీద్ ఖాన్ తీవ్రంగా ఇబ్బంది ప‌డుతూ వ‌స్తున్నాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో తాను టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నా అని ర‌షీద్ ఖాన్ తెలిపాడు. కాబ‌ట్టి టెస్టు క్రికెట్‌లో ఆడాలా వ‌ద్దా అనేది అత‌డి ఇష్టానికే వ‌దిలేస్తున్నాం' అని తెలిపాడు.

కాగా ర‌షీద్ ఖాన్ గైర్హాజ‌రీలో అఫ్గానిస్తాన్ జ‌ట్టుకు హ‌ష్మ‌తుల్లా షాహిది జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు. జ‌ట్టులో ర‌హ‌మ‌నుల్లా జ‌ద్ర‌న్‌, అఫ్స‌ర్ జ‌జాయ్‌, ఇక్ర‌మ్ అలీఖిలి, అజ్మ‌తుల్లా ఒమ‌ర్‌జ‌య్‌లు కీల‌క ఆట‌గాళ్లుగా ఉన్నారు. ఇక అఫ్గానిస్తాన్ 2018లో టెస్టు హోదా పొందింది. అప్ప‌టినుంచి 12 మ్యాచ్‌లాడ‌గా, నాలుగు విజ‌యాలు, ఏడు ఓట‌ములు, ఒక డ్రా న‌మోదు చేసింది. 

అఫ్గానిస్తాన్ చివ‌ర‌గా గ‌తేడాది అక్టోబ‌ర్‌లో జింబాబ్వేతో టెస్టు మ్యాచ్‌ ఆడింది. అయితే ఆ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 73 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. అఫ్గానిస్తాన్ స్టార్ బౌల‌ర్‌గా వెలుగొందుతున్న ర‌షీద్ ఖాన్ ఆల్‌రౌండ‌ర్‌గా రాణిస్తున్నాడు. ఆ జ‌ట్టు త‌ర‌ఫున ఆరు టెస్టుల్లో 154 ప‌రుగులు, 45 వికెట్లు; 117 వ‌న్డేల్లో 1,393 ప‌రుగులు, 210 వికెట్లు; 113 టీ20ల్లో 622 ప‌రుగులు, 190 వికెట్లు తీశాడు.

చదవండి: ఆసీస్‌పై సిరీస్‌ విజయం.. పాక్ క్రికెటర్‌కు బంపరాఫర్‌!

Advertisement
 
Advertisement
Advertisement