
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్‌లో అత్యత్తుమ బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. రషీద్ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఐదవ స్థానంలో ఉన్నాడు. కొంత కాలం నెం1 స్థానంలో కూడా కొనసాగాడు. ప్రస్తుతం ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ''డ్రీమ్ హ్యాట్రిక్''ను ఎంపిక చేశాడు. అతడిని డ్రీమ్ హ్యాట్రిక్ గురించి ప్రశ్నించినప్పుడు.. దానికి బదులుగా విరాట్ కోహ్లి, బాబర్ ఆజాం, కేన్ విలియమ్సన్ అని రషీద్ వెంటనే బదులు ఇచ్చాడు. అదే విధంగా కోహ్లిని ఔట్ చేయడం అంటే అత్యంత ఇష్టమనని రషీద్ పేర్కొన్నాడు.
ఇక ఇప్పటి వరకు రషీద్ బౌలింగ్‌లో 24 బంతులు ఎదుర్కొన్నకోహ్లి.. 21 పరుగులు సాధించాడు. కాగా ఒకే ఒక్క సారి మాత్రమే కోహ్లిని రషీద్ ఔట్ చేశాడు. కాగా 2017 నుంచి 2021 వరకు విలియమ్సన్‌తో కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటి వరకు రషీద్ బౌలింగ్‌లో 29 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్.. 30 పరుగులు చేశాడు. విలియమ్సన్‌ను రషీద్ ఖాన్ ఒక్కసారి మాత్రమే అవుట్ చేశాడు. ఇక బాబర్ ఆజాంను ఇప్పటి వరకు రషీద్ ఐదు సార్లు ఔట్ చేశాడు.
చదవండి: IPL 2022: 'కోహ్లి వరుసగా రెండు గోల్డెన్ డక్‌లు.. మాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి'
Comments
Please login to add a commentAdd a comment