
ఢిల్లీ: అందేంటి... అనుష్క శర్మ విరాట్ కోహ్లి సతీమణి కదా, మరి రషీద్ ఖాన్ అంటారేంటి అనుకుంటున్నారా. మరేమి లేదండి, గూగుల్‌లో 'రషీద్ ఖాన్ భార్య' అని సెర్చ్ చేస్తే అనుష్క శర్మ అని వస్తుంది. నిజానికి రషీద్ ఖాన్‌కు అసలు పెళ్లే కాలేదు. మరి ఎందుకు ఇలా వస్తుందనేగా మీ డౌట్. 2018లో తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో మాట్లాడుతూ... తన ఫేవరెట్ హీరోయిన్ అనుష్క శర్మ, ప్రీతి జింతా అని చెప్పాడు. అంతే ఇక అప్పటి నుంచి ఈ వార్త ట్రెండింగ్‌గా మారింది. రషీద్ ఖాన్ ఫేవరెట్ అనుష్క శర్మ అని ఎక్కువగా వార్తలు వచ్చాయి. అప్పటినుంచి గూగుల్ ఇలా చూపిస్తుందట. ఇది ఊరికే చెప్పట్లేదు. కావాలంటే మీరు సెర్చ్ చేసి చూడండి.
అఫ్గనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడుతున్నాడు. అతడికి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అడిగితే, అఫ్గనిస్తాన్ జట్టు వరల్డ్ కప్ గెలిచే వరకు తాను పెళ్లి చేసుకోనని ఈ ఏడాది జూలైలో ఇచ్చిన ఓ ఇంటర్వూలో తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment