PC: IPL
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన ఫీట్ సాధించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో రషీద్ ఖాన్ 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో(83) 100 వికెట్ల పడగొట్టిన మూడో బౌలర్‌గా రషీద్ ఖాన్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2022లో భాగంగా శనివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్ ఈ రికార్డు సాధించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో అమిత్ మిశ్రా, ఆశిష్ నెహ్రా ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్‌పై గుజరాత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రస్సెల్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో షమీ, యశ్ దయాల్, రషీద్ ఖాన్ తలో వికెట్లు పడగొట్టగా జోసెఫ్, ఫెర్గూసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు హార్ధిక్ పాండ్యా (67) రాణించడంతో గుజరాత్ 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో రసెల్ 4,సౌథీ 3, మావి, ఉమేశ్ తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: IPL 2022 DC Vs RR: నో బాల్ రాద్ధాంతం.. పంత్, శార్దూల్‌లకు భారీ షాక్, ఆమ్రేపై నిషేధం
Comments
Please login to add a commentAdd a comment