కెప్టెన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌.. బంగ్లాను చిత్తు చేసిన ఇంగ్లండ్ | Ravi Bopara-Captain Innings-ENG Champions Won-7 Wkts Vs BAN-WCL 2026 | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌.. బంగ్లాను చిత్తు చేసిన ఇంగ్లండ్

Oct 6 2026 7:10 AM | Updated on Oct 6 2026 7:18 AM

Ravi Bopara-Captain Innings-ENG Champions Won-7 Wkts Vs BAN-WCL 2026

వ‌రల్డ్ చాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డ‌బ్ల్యూసీఎల్‌) 2026 టోర్నీలో ఇంగ్లండ్ చాంపియ‌న్స్ వ‌రుస విజ‌యాల‌తో దుమ్మురేపుతోంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టుకు షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ తాజాగా బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. సోమ‌వారం రాత్రి షార్జా వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ చాంపియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు చేసింది. 

బంగ్లా బ్యాట‌ర్ల‌లో రోనీ త‌లుక్‌దార్ (44), ఫేజ‌ల్ మ‌హ్ముద్ (26), చివ‌ర్లో అబు జాయెద్ (16 బంతుల్లో 31 నాటౌట్‌) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో స‌మిత్ ప‌టేల్ 4 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, రెయాన్ సైడ్‌బాట‌మ్ రెండు వికెట్లు తీశాడు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ చాంపియ‌న్స్ 16.1 ఓవ‌ర్ల‌లోనే 3 వికెట్లు కోల్పోయి 166 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. 

ఓపెన‌ర్ కమ్ కెప్టెన్ ర‌వి బొపారా (45 బంతుల్లో 77 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) అజేయ ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించ‌గా, వికెట్ కీప‌ర్ ఫిల్ మ‌స్ట‌ర్డ్ (17 బంతుల్లో 37 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్ల‌లో అబు జాయెద్‌, ఇనాముల్ హ‌క్, జియావుర్ రెహ్మాన్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అల‌రించిన ర‌వి బొపారా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement