అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సరి కొత్త చరిత్ర సృష్టించారు. ఒక వన్డే మ్యాచ్‌లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జంటగా జడేజా, కుల్దీప్ యాదవ్ నిలిచారు. గురువారం బార్బోడస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో వీరిద్దరూ కలిసి 7 వికెట్లు పడగొట్టారు. తద్వారా ఈ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకున్నారు.
42 ఏళ్ల భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటి సారి. ఇక ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా.. జడేజా 37 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా విండీస్‌ను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ షై హోప్ (45 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం ఇదే మైదానంలో జరుగుతుంది.
చదవండి: నేను అస్సలు ఊహించలేదు.. కానీ క్రెడిట్ మొత్తం వాళ్లకే! అతడు సూపర్: రోహిత్ శర్మ
🚨 Milestone Alert 🚨#TeamIndia pair of @imkuldeep18 (4⃣/6⃣) & @imjadeja (3⃣/3⃣7⃣ ) becomes the first-ever pair of Indian left-arm spinners to scalp 7⃣ wickets or more in an ODI 🔝 #WIvIND pic.twitter.com/F18VBegnbJ
— BCCI (@BCCI) July 27, 2023
Comments
Please login to add a commentAdd a comment