
Photo credit: IPL Twitter
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 23, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి తొలి బంతికే భారీ షాక్ తగిలింది. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డకౌటై ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాడు. సొంత మైదానంలో ఇరగదీస్తాడనుకున్న కోహ్లి ఉసూరుమనిపించడంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
#ViratKohli #rcbvsrr pic.twitter.com/V55XZZhw0C
— Akash Kharade (@cricaakash) April 23, 2023
ఓ మహిళా అభిమాని అయితే కోహ్లి తొలి బంతికే కావడంతో బాధ తట్టుకోలేక, తల బాదుకుంటూ కనిపించింది. కోహ్లికి వీరాభిమానిలా కనిపించిన సదరు మహిళ.. ఎండను సైతం లెక్కచేయకుండా కోహ్లి ఆట చూసేందుకే స్టేడియం వచ్చినట్లు కనపడింది. అద్భుతమైన బంతితో బౌల్ట్.. కోహ్లిని వికెట్ల ముందు దొరికించుకున్నాడు. బౌల్ట్ అప్పీల్ చేయగానే అంపైర్ వైపు కూడా చూడకుండానే కోహ్లి పెవిలియన్ బాటపట్టాడు.
కాగా, కోహ్లి ఔటైన కొద్దిసేపటికే ఆర్సీబీ మరో వికెట్ కూడా కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి షాబాజ్ అహ్మద్ (2) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ (19 బంతుల్లో 40), అప్పటికే క్రీజ్‌లో ఉన్న డుప్లెసిస్ (18 బంతుల్లో 30) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. 7 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 72/2గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment