IPL 2022: Reason Behind Suryakumar Yadav Unveiled His Namaste Celebration Against RCB - Sakshi
Sakshi News home page

IPL 2022: సూర్యకుమార్‌ యాదవ్‌ నమస్తే సెలబ్రేషన్స్‌.. కారణం ఎంటో తెలుసా..?

Published Mon, Apr 11 2022 8:19 PM | Last Updated on Tue, Apr 12 2022 8:14 AM

Reason Bheind Suryakumar Yadav unveiled his Namaste celebration against RCB - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియన్స్‌ వరుస ఓటములు చెందుతున్నప్పటికీ.. ఆ జట్టు బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం అదరగొడుతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన సూర్య వరుస అర్ధసెంచరీలు సాధించాడు. కాగా ఏప్రిల్ 9 (శనివారం) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో 68 పరుగులు సూర్యకుమార్‌ యాదవ్‌ సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించాక సూర్యకుమార్‌.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షుకుల వైపు చూస్తూ నమస్తే సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు.

ఈ క్రమంలో సూర్య నమస్తే సెలబ్రేషన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సూర్య సెలబ్రేషన్స్‌ నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. అయితే సూర్య అటువంటి సంబురాలు జరపుకోవడానికి ఓ కారణం ఉంది. సూర్యకుమార్ యాదవ్‌ తల్లిదండ్రులు మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చారు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న తన తల్లిదండ్రులు వైపు చూస్తూ సెలబ్రేషన్స్‌ జరపుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

చదవండి: IPL 2022: సూర్యకుమార్ యాదవ్ హెలికాప్టర్ షాట్‌.. 98 మీటర్ల భారీ సిక్సర్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement