IPL 2023 Prize Money Details - IPL Winner Team Will Get This Whopping Amount: Report - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌-2023 ఛాంపియన్స్‌కు ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

Published Sat, May 27 2023 3:05 PM | Last Updated on Sat, May 27 2023 3:17 PM

Reports: IPL 2023 champions to receive INR 20 crore prize money - Sakshi

ఐపీఎల్‌-2023 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(మే28) అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక క్యాష్‌రిచ్‌ లీగ్‌కు సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను ఓ సారి తెలుసుకుందాం.


విజేతకు ఎన్ని కోట్లంటే?
స్పోర్ట్‌స్టార్ నివేదిక ప్రకారం.. ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీగా రూ. 20 కోట్లు ఇవ్వనున్నారు. అదే విధంగా రన్నరప్‌కు ప్రైజ్ మనీగా రూ. 13 కోట్లు ఇవ్వనున్నారు. 

ఎలిమినేటర్ విజేత ముంబై ఇండియన్స్‌కు 7 కోట్ల నగదు బహుమతి దక్కనుంది. ఎలిమినేటర్‌లో ఓడిపోయిన లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌కు 6.5 కోట్లు క్యాష్‌ రివార్డ్‌ అందనుంది.

ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఆటగాడికి ప్రైజ్ మనీ ఎంతంటే?
 ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడికి ప్రైజ్ మనీగా రూ.15 లక్షలు అందజేస్తారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఉన్నాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. 851 పరుగులు చేశాడు. 

పర్పుల్ క్యాప్ విజేతకు ఎంత ప్రైజ్ మనీ ఎంతంటే?
ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్ గెలుచుకున్న ఆటగాడికి ప్రైజ్ మనీగా రూ.15 లక్షలు అందజేస్తారు. ఈ జాబితాలో ప్రస్తుతం మహ్మద్‌ షమీ(28) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో రషీద్‌ ఖాన్‌(27), మొహిత్‌ శర్మ(24) ఉన్నారు.

ఈ సీజన్‌లో సూపర్ స్ట్రైక్ అవార్డు గెలుచుకున్న బ్యాట్స్‌మన్‌కు ప్రైజ్ మనీగా రూ. 15 లక్షలు ఇవ్వనున్నారు.

ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్న ఆటగాడికి ప్రైజ్ మనీగా రూ.20 లక్షలు ఇవ్వనున్నారు.
చదవవండి: WTC final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement