Rohit Sharma Angry Outburst at Broadcasters During DRS of Handscomb - Sakshi
Sakshi News home page

IND vs AUS: నా ముఖం కాదురా అయ్యా.. ముందు రిప్లేలు చూపించు! రోహిత్‌ సీరియస్‌

Published Sun, Feb 12 2023 11:54 AM | Last Updated on Sun, Feb 12 2023 12:54 PM

Rohit Sharma angry outburst at broadcasters during DRS of Handscomb  - Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో భారత్‌ విజయభేరి మోగించింది. ఈ ఘన విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే తొలి టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

ఏం జరిగిందంటే?
ఆస్ట్రేలియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌లో అశ్విన్‌ వేసిన తొలి బంతికి పీటర్ హ్యాండ్‌స్కాంబ్‌ ఢిపెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో వెంటనే బౌలర్‌తో పాటు వికెట్‌ కీపర్‌ కూడా ఎల్బీకి అప్పీల్‌ చేశారు. కానీ అంపైర్‌ మాత్రం నాటౌన్‌ అని తల ఊపాడు. ఈ ‍క్రమంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రివ్యూకు వెళ్లాడు.

ఈ సమయంలో కెమెరామెన్‌ రిప్లేలను స్క్రీన్‌లను చూపించకుండా రోహిత్ శర్మను చూపించాడు.  దీంతో అసహనానికి గురైన రోహిత్.. "నా ముఖం కాదు.. ముందు రిప్లేలను చూపించండి" అంటూ బ్రాడ్‌కాస్టర్‌ను తిట్టడం కెమెరాలలో కన్పించింది. రోహిత్‌ మాటలకు పక్కన ఉన్న సహాచర ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


చదవండి: IND vs AUS: భారత్‌తో రెండో టెస్టు.. ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement