సిక్సర్ల రోహిత్‌ అరుదైన రికార్డు | Rohit Sharma Became First Batsman To Hit 200 Sixes In India | Sakshi
Sakshi News home page

సిక్సర్ల రోహిత్‌ అరుదైన రికార్డు

Published Sun, Feb 14 2021 11:54 AM | Last Updated on Sun, Feb 14 2021 1:39 PM

Rohit Sharma Became First Batsman To Hit 200 Sixes In India - Sakshi

చెన్నై: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు. స్వదేశంలో 200 సిక్స్‌లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రోహిత్‌ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగుల వద్ద రోహిత్‌ ఈ ఘనత అందుకున్నాడు. ఇంతకముందు టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని స్వదేశంలో 186 సిక్స్‌లు బాదగా... మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ 113 సిక్స్‌లు కొట్టాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలుపుకొని 428 సిక్స్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు.

కాగా వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ అన్ని ఫార్మాట్లు కలిపి 534 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది 476 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా నుంచి ఎంఎస్‌ ధోని 359 సిక్స్‌లతో ఆరో స్థానంలో నిలిచాడు. ఆఫ్రిది ఇప్పటికే రిటైర్‌ కావడంతో.. రోహిత్‌ త్వరలోనే అతన్ని అధిగమించే అవకాశం ఉంది. కాగా రోహిత్‌ ఇంగ్లండ్‌తో  జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. 231 బంతులాడిన రోహిత్‌ 18 ఫోర్లు, 2 సిక్స్‌లతో 161 పరుగులు చేశాడు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఇంగ్లండ్‌ జట్టు రెండో రోజు లంచ్‌ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. 
చదవండి: 'అలీ బాయ్‌.. అజిత్‌ సినిమా అప్‌డేట్‌ ఏంటి!'
15 నెలల తర్వాత.. అన్ని స్వదేశంలోనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement