రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే పేరు. ఒక సాధారణ క్రికెటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి టీమిండియా కెప్టెన్‌గా ఎదిగిన రోహిత్ శర్మ గురించి ఎంతచెప్పుకున్న తక్కువే. తన కెరీర్‌లో ఎన్నో అవమానాలు దాటి భారత జట్టును నడిపించే స్థాయికి చేరుకున్న రోహిత్.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
అభిమానులు ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకుంటారు. భారత్‌లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత తరం గొప్ప ఆటగాడిగా పేరున్న విరాట్ కోహ్లీలతో సమానంగా అదరణపొందే ఏకైక ఆటగాడు హిట్‌మ్యాన్. రోహిత్ తన పేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. ఒకే వన్డే వరల్డ్‌కప్‌లో 5 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు హిట్‌మ్యాన్ కావడం విశేషం.
అదే విధంగా ఐపీఎల్‌లో కూడా తనకంటూ ఓ ప్రత్యేక చరిత్రను రోహిత్ లిఖించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో సారధిగా ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలిచిన ఘనత రోహిత్‌ది. ఇక ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన రోహిత్..ఆదివారం(ఏప్రిల్ 30) తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీంతో రోహిత్‌కు సోషల్‌మీడియా వేదికగా క్రికెటర్లతో పాటు అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.
హైదరాబాద్‌లో భారీ కటౌట్..
ఇక రోహిత్ పుట్టింది ముంబైలో అయినప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో ఐపీఎల్ ఆరంభ సీజన్లలో రోహిత్ శర్మ హైదరాబాద్ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడాడు. 2009లో టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు.
ఈ క్రమంలో రోహిత్ పుట్టినరోజును హైదరాబాద్‌లో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకంగా 60 అడుగుల రోహిత్ శర్మ కటౌట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్‌కు కూడా ఇంత పెద్ద కటౌట్ పెట్టలేదు.
Puttinaroju spesal 💙
— Mumbai Indians (@mipaltan) April 30, 2023
A 6️⃣0️⃣ feet cut-out of Hitman in Hyderabad 😍
📸: @mitelugufc #OneFamily #Hitman10 #HappyBirthdayRohit #MumbaiMeriJaan #MumbaiIndians @ImRo45 pic.twitter.com/B1DMcy6mrI
Comments
Please login to add a commentAdd a comment