IPL 2023, MI Vs CSK: Ajinkya Rahane Smashes 23 Runs In Arshad Khan's Over, Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2023- Rahane: 34 ఏళ్ల వయస్సులో విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 23 పరుగులు! వీడియో వైరల్‌

Published Sun, Apr 9 2023 8:40 AM | Last Updated on Sun, Apr 9 2023 11:06 AM

Ajinkya Rahane smashes 23 runs in Arshad Khans over during MI vs CSK match - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సీఎస్‌కే గెలుపొందింది. 158 పరుగుల లక్ష్యంతో దిగిన సీఎస్‌కే 18.1 ఓవర్లలో కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయి అలోవకగా ఛేదించింది.

రహానే విధ్వంసం..
ఈ రన్‌ ఛేజింగ్‌లో సీఎస్‌కే ఆటగాడు, టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ అజింక్యా రహానే  విధ్వంసం సృష్టించాడు. కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రహానే 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 61 పరుగులు చేశాడు. రహానే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను కేవలం 19 బంతుల్లోనే అందుకున్నాడు. 

తద్వారా ఈ ఏడాది సీజన్‌లో అత్యంత వేగంగా హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రహానే నిలిచాడు. ఇక సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ వేసిన అర్షద్‌ ఖాన్‌కు రహానే చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో  ఒక సిక్స్‌, నాలుగు ఫోర్ల సాయంతో ఏకంగా 23 పరుగులను రహానే పిండుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 34 ఏళ్ల వయస్సులో ఇటువంటి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన రహానే సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్‌12న రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.
చదవండి#Ajinkya Rahane: శాంతంగా కనిపించే రహానే ఉగ్రరూపం.. సీజన్‌లోనే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ
                  IPL 2023: ఏంటి బ్రో ఇది.. 17 కోట్లు తీసుకున్నావు! ఈ చెత్త ఆటకేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement