
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సీజన్ నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ జట్టు పేరులో స్వల్ప మార్పుచేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీబీ తమ జట్టు పేరును ఇంగ్లీష్‌లో (Royal Challengers Bangalore) అని రాసుకొస్తోంది.
అయితే ఇకపై (Royal Challengers Bengaluru)గా మార్చనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆర్సీబీ షేర్ చేసిన ఓ వీడియో ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. ఈ వీడియోలో శాండల్‌వుడ్ నటుడు రిషబ్ శెట్టి మూడు దున్నలను తీసుకువచ్చి వాటిపై రాయల్(Royal), ఛాలెంజర్స్(Challengers), బెంగళూరు(Bangalore) అని వేర్వేరుగా రాసి ఉన్నాయి. ఈ క్రమంలో రిషబ్ బెంగళూరు(Bangalore) అని రాసి ఉన్న దున్నను తీసుకెళ్లిపోమని ఓ వ్యక్తితో చెబుతాడు.
కాగా క్రికెటేతర క్రీడల్లో Bangalore అని కాకుండా Bengaluru గా రాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్ధానిక అభిమానుల కోరిక మెరకు ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టుపేరును Bengaluruగా మార్చుకోనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా మార్చి 19న చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న 'ఆన్‌బాక్స్' ఈవెంట్‌లో ఆధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.