ప్రముఖ తెలుగు యాంకర్ వర్షిణిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వర్షిణి స్టేడియంకు వచ్చిన ప్రతిసారి (3 పర్యాయాలు) సన్‌రైజర్స్ ఓటమిపాలు కావడంతో ఫ్యాన్స్ పట్టరాని కోపంతో ఊగిపోతున్నారు. సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అయ్యే ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు.. వర్షిణి మరోసారి స్టేడియంలో కనిపిస్తే అంతు చూస్తామంటూ ధమ్కీ ఇస్తున్నారు.
కొందరు అభిమానులైతే.. సన్‌రైజర్స్‌కు ఉన్న దరిద్రం చాలు.. నువ్వు కూడా తోడైతే ఆ జట్టు గట్టెక్కినట్లే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రాకే.. ఇంకా సన్‌రైజర్స్‌కు ప్లే ఆఫ్స్‌అవకాశాలు ఉన్నాయంటూ బ్రతిమలాడుకుంటున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌కు ఇవాళ (మే 7) మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు వర్షిణిపై ట్రోల్స్ డోసును మరింత పెంచారు. వర్షిణిని స్టేడియంకు రావొద్దని ప్రాధేయపడుతున్నారు.
కాగా, ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ హైదరాబాద్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లను చూసేందుకు వర్షిణి స్టేడియంకు వెళ్లింది. ఏప్రిల్ 18న ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 24న ఢిల్లీ క్యాపిటల్స్, మే 4న కేకేఆర్‌తో సన్‌రైజర్స్ ఆడిన మ్యాచ్‌లను ఆమె ప్రత్యక్షంగా వీక్షించింది. ఈ 3 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. మ్యాచ్‌ను చూడటానికి స్టేడియంకు వచ్చిన వర్షిణి తిన్నగా ఉంటే సరిపోయేది. ఆమె చేసిన హడావుడి కారణంగానే ట్రోలింగ్‌కు గురవుతుంది. స్టేడియంలో దిగిన ఫోటోలు, సూర్యకుమార్‌తో వయ్యారంగా తీసుకున్న సెల్ఫీని వర్షిణి సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ చిర్రెత్తుకొచ్చింది. దీంతో వారు వర్షిణిని టార్గెట్ చేశారు.
చదవండి: రోహిత్ శర్మ కాదు 'నో హిట్ శర్మ' అని పేరు మార్చుకో.. నేనైతే నిన్ను జట్టులోకి కూడా తీసుకోను..!
Comments
Please login to add a commentAdd a comment