
మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టూర్–250 స్థాయి టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి అరంగేట్రం చేసింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరుగుతున్న క్లీవ్‌ల్యాండ్ డబ్ల్యూటీఏ–250 టోర్నీ క్వాలిఫయింగ్‌లో సహజ బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 305వ ర్యాంక్‌లో ఉన్న సహజ తొలి రౌండ్‌లో 2–6, 1–6తో ప్రపంచ 91వ ర్యాంకర్ జెస్సికా (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది.