టీమిండియాతో ఈ నెల (సెప్టెంబర్) 22, 24, 27 తేదీల్లో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (సెప్టెంబర్ 17) జట్టును ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు పాట్ కమిన్స్ నాయకత్వం వహించనున్నాడు. వరల్డ్‌కప్‌కు కేవలం కొద్దిరోజుల ముందు జరిగే సిరీస్ కావడంతో ఆసీస్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. సౌతాఫ్రికాతో సిరీస్ సందర్భంగా ఎడమ చేతి ఫ్రాక్చర్‌కు గురైన ట్రవిస్ హెడ్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు.
మరోవైపు సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్లు పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తిరిగి జట్టులో చేరారు. ఈ సిరీస్‌లో తొలి వన్డే మొహాలీలో, రెండో వన్డే ఇండోర్‌లో, మూడో వన్డే రాజ్‌కోట్‌లో జరుగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్ అయిపోయిన వెంటనే వరల్డ్‌కప్ సన్నాహక మ్యాచ్‌లు మొదలవుతాయి. అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌కప్ మ్యాచ్‌లు స్టార్ట్ అవుతాయి.
డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో 2023 వరల్డ్‌కప్ మొదలవుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మెగా టోర్నీలో భారత్.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆతర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో, అక్టోబర్ 14న పాకిస్తాన్‌లను ఢీకొంటుంది. చిరకాల ప్రత్యర్ధితో మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
Comments
Please login to add a commentAdd a comment